YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ కూటమి కడతారా

మళ్లీ కూటమి కడతారా

మళ్లీ కూటమి కడతారా
ఏలూరు, నవంబర్ 13,
ఏపీలో జగన్‌కు చెక్ పెట్టడానికి చంద్రబాబు-పవన్ కళ్యాణ్‌ ఏకమవుతున్నారని రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబుకు….జగన్‌ని ఢీకొట్టే సత్తా రావడం లేదు. అలా అని పవన్‌కు అసలు ఆ సత్తా లేదు. కాకపోతే బాబు-పవన్ కలిస్తే మాత్రం కాస్త రాజకీయం మారుతుంది…జగన్‌కు చెక్ పెట్టే అవకాశాలు పెరుగుతాయి. అందుకే టీడీపీ-జనసేనలు పొత్తు దిశగా ముందుకెళుతున్నాయని ప్రచారం నడుస్తోంది.అయితే వీరి పొత్తులో బీజేపీ కలిసే అవకాశాలు లేవని అర్ధమవుతుంది. బీజేపీని దగ్గర చేసుకోవాలని బాబు బాగానే ప్రయత్నిస్తున్నారు…కానీ ఆ పార్టీ దగ్గర కావడం లేదు. దీంతో బీజేపీ-జనసేన పొత్తు కూడా పెటాకులు అయ్యేలా ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఏదో కేంద్రం అండ ఉంటుంది తప్ప…రాజకీయంగా పవన్ బలపడే పరిస్తితి లేదు. ఆ విషయం ఇప్పటికే అర్ధమైంది.
బీజేపీతో ముందుకెళితే ఎన్నికల్లో రాణించడం కష్టమని పవన్‌కు అర్ధమవుతుంది. అదే టీడీపీతో కలిస్తే ఓ 10 సీట్లు అయిన గెలుచుకోవచ్చు. అందుకే పవన్..బాబుతో కలిసి ముందుకెళ్లాలని చూస్తున్నారు. బీజేపీ మాత్రం కలిసి రావడం లేదు. దీంతో బీజేపీని పవన్వదిలేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇక టీడీపీ-జనసేనలని కలిపేందుకు బీజేపీ సీనియర్ కామినేని శ్రీనివాస్ కూడా గట్టిగానే ట్రై చేస్తున్నారట.కమ్మ వర్గానికి చెందిన కామినేనికి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటు పవన్‌తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో కామినేని టీడీపీలో పనిచేశారు…ప్రజారాజ్యంలో కూడా పనిచేశారు. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. గతంలో పొత్తుతో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. కానీ తర్వాత పొత్తు విడిపోయాక కామినేని ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే ఈయన జనసేనలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రచారం నడుస్తోంది. ఒకవేళ బీజేపీ…టీడీపీకి దూరంగా ఉంటే…ఈయన జనసేనలో చేరి…టీడీపీతో పొత్తు సెట్ చేసేలా ఉన్నారు. మొత్తానికైతే బాబు-పవన్‌ల కలవడం గ్యారెంటీ అని తెలుస్తోంది.

Related Posts