YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కే.ఎల్ రాహుల్ ఆటకి ముగ్దురాలైన పాక్ యాంకర్..!!

 కే.ఎల్ రాహుల్ ఆటకి ముగ్దురాలైన పాక్ యాంకర్..!!

 కే ఎల్  రాహుల్ ఐపీఎల్ లో  అత్యధిక ధర పలికిన భారత ఆటగాడు. ఈ సీజన్ లో అయన పంజాబ్ కి ప్రాతినిధ్యం  వహిస్తున్నాడు. పంజాబ్ విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్న రాహుల్ ఈ సీజన్ లో ఆరంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. ఇక జైపూర్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను మరో చూడచక్కని ఇన్నింగ్‌ ఆడాడు. ఒకవైపు సహచర బ్యాట్స్‌మెన్‌ వెంటవెంటనే ఔట్‌ అవుతున్నా..రాహుల్‌ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా చివరివరకూ పోరాడాడు. ఎదుర్కొన్న 70బంతుల్లో 11బౌండరీలు, రెండు సిక్సర్లతో 95పరుగులు సాధించి అజేయంగా నిలిచి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో అతని బ్యాటింగ్‌ చూసి ముగ్ధురాలైన పాకిస్థాన్‌ యాంకర్‌ జైనబ్‌ అబ్బాస్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘కేఎల్‌ రాహుల్‌ కొట్టిన షాట్లు ఆకట్టుకున్నాయి. సూపర్‌ టైమింగ్‌తో అద్భుత ప్రదర్శన చేశావు. ఈ మ్యాచ్‌ చూడటానికి చాలా గొప్పగా అనిపించింది’ అంటూ ట్వీట్‌ చేశారు. ఆమె చేసిన ట్విట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Posts