YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సామాజిక వర్గాన్నే నమ్ముకున్న జనసేనాని

సామాజిక వర్గాన్నే నమ్ముకున్న జనసేనాని

రాజమండ్రి, నవంబర్ 15,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి కాపు ఓటు బ్యాంకు పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తనకు ఈసారైనా కాపు సామాజికవర్గం అండగా నిలుస్తుందని భావిస్తున్నారు. కానీ హరిరామ జోగయ్య తప్పించి పవన్ కల్యాణ్ పిలుపునకు పెద్దగా స్పందన కన్పించడం లేదు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన సభలో పవన్ కల్యాణ‌్ కాపులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత కాపు సామాజికవర్గం పెద్దలపై ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఏకం కావాలంటూ... రాజ్యాధికారం కావాలంటే సంఘటితం కావడం ఒక్కటే మార్గమమని పవన్ కల్యాణ్ తెలిపారు. వీరి ఐక్యత కోసం కాపు పెద్దలు కృషి చేయాలని కోరారు. కానీ కాపు సామాజకవర్గం పెద్దల నుంచి పవన్ పిలుపునకు రెస్పాన్స్ పెద్దగా లేదు. ఒక్క హరిరామ జోగయ్య కాపు సంక్షేమ సేన పేరుతో కొంత హడావిడి చేస్తున్నారు. కాపు రిజర్వేషన్ల ను రాష్ట్రంలో అమలు చేయాలంటూ ఆయన ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. గత ఎన్నికల్లో కాపులు ఎక్కువగా వైసీపీ వైపు నిలిచారు. చంద్రబాబు పాలనపై విసుగుచెంది ఉండటం, పవన్ కల్యాణ‌్ పై నమ్మకం లేకపోవడంతో జగన్ కు మెజారిటీ కాపు సామాజికవర్గం అండటగా నిలిచింది. కానీ ఏపీలో అత్యథికంగా ఉన్న కాపు సామాజికవర్గాన్ని గంప గుత్తగా తన వైపునకు నిలుపుకునేందుకు పవన్ కల్యాణ్ పరోక్షంగా అన్ని ప్రయత్నాలను మొదలు పెట్టేశారంటున్నారు. ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు పెద్దలను త్వరలో నేరుగా కలవాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపు ఎంత అవసరమో వారికి పవన్ కల్యాణ్ వివరించనున్నారు. వైసీపీ ప్రభుత్వం కాపుల పట్ల వ్యవహరిస్తున్న తీరును కూడా ఆయన చెప్పనున్నారు. వచ్చే ఎన్నికల్లో మిగిలిన పార్టీల నుంచి కాపు అభ్యర్థులు నిలబడినా జనసేన నుంచి పోటీ చేసిన వారినే అసలైన కాపులుగా గుర్తించాలని కూడా ఆయన కోరనున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ సమావేశం జరగవచ్చని పార్టీలో చర్చ జరుగుతోంది.

Related Posts