YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కళ్యాణ మండపం నుంచి వధువు జంప్ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని పోలీసు స్టేషన్ కి

కళ్యాణ మండపం నుంచి వధువు జంప్ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని పోలీసు స్టేషన్ కి

మదనపల్లె
నాలుగైదు గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా కల్యాణ మండపం నుంచి పరారైన వధువు మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని పోలీసులను ఆశ్ర యించింది. మదనపల్లెకు చెందిన యువకుడికి, అదే మండలానికి చెందిన యువతికి పెద్దలు నెల క్రితం వివాహం నిశ్చయించారు.  శనివారం రాత్రి స్థానిక కల్యాణ మండపంలో విందు ఏర్పాటు చేసి అక్కడే వధూవరులకు నలుగు పెట్టారు.  ఆదివారం ఉదయం 5.30 గంటలకు పెళ్లి జరగాల్సి ఉండగా.. శనివారం అర్ధరాత్రి వధువు మండపం నుంచి వెళ్లిపోయింది.  తెల్లవారుజామున గుర్తించిన కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికారు. ఆచూకీ దొరక్కపోవడంతో ఆమె తల్లి దండ్రులు, పెళ్లి కుమారుడు, బంధువులు రెండో పట్టణ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వారంతా స్టేషన్ వద్ద ఉండగానే ఆ వధువు తనకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకొని అక్కడకు వచ్చింది.  తమకు రక్షణ కల్పించాలని పోలీ సులను కోరింది.   యువతి మేజర్ కావడంతో ఆమె ఇష్ట ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారు.   వధువు మాట్లాడుతూ.. 'ఇష్టం లేని వివాహం చేస్తున్నారని ఈనెల 3న డయల్ 100కు ఫోన్ చేస్తే పోలీ సులు వచ్చి నా తల్లిదండ్రులతో మాట్లాడారు.  అప్పుడు పెళ్లి చేయమని పోలీసులకు చెప్పి.. ఆ తర్వాత నన్ను గృహ నిర్బంధం చేశారు. అందుకే వివాహ సమయంలో అందరూ నిద్రిం చాక వెళ్లి.. ప్రేమించిన వ్యక్తిని పుంగనూరులో పెళ్లి చేసుకున్నా' అని తెలిపింది.

Related Posts