అమరావతి
ఏపీలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉందా..? ఎన్నికలు నిర్వహించడం చేత కాకుంటే వెళ్లిపోవాలి. అధికారం ఉంటే ఎన్నికలు పెట్టకుండా నామినేట్ చేసుకోండి. దొంగ ఓటర్లను ప్రజలే పట్టుకుని అప్పగిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. కొందరు పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పోలింగ్ స్టేషన్లల్లోకి ఎలా వెళ్తారు. ఎంతో కాలం వైసీపీ ఆటలు సాగవ్. ఎంత మందిపై పోలీసులు కేసులు పెట్టారు.. ఎంత మందిని పట్టుకున్నారు..? దొంగ ఓట్లను పట్టించే వారి పైనే కేసులు పెడతారా..? రోడ్ల మీదకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాడుతున్నారు. ఎన్నికల్లో గెలవడానికి నానా గడ్డి తింటారా..? ప్రతి విషయంలోనూ మైండ్ గేమా..? ప్రజలే అధికార పార్టీ నేతలతో మైండ్ గేమ్ ఆడే రోజులు వచ్చాయని అయన అన్నారు. ఏం చేసినా జరిగిపోతోందనేదే ప్రభుత్వ ధీమా. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడితే.. ఆ వ్యవస్థలు మన కుటుంబాలను కాపాడతాయి. ఏపీ నుంచి కూరగాయల పేరుతో గంజాయిని తరలిస్తున్నారు.. అలాంటి వాటిపై పోలీసులు పోరాడరా..? ప్రజాస్వామ్యాన్ని కాపాడే వారిపైనే పోలీసులు పోరాడతారా అని ప్రశ్నించారు.