YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమ్మ ఒడి... న్యూ కండిషన్స్

అమ్మ ఒడి... న్యూ కండిషన్స్

నెల్లూరు, నవంబర్ 16,
ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులకు జగన్ సర్కారు బిగ్ అలర్ట్ ఇచ్చింది. అమ్మఒడి పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అమ్మ ఒడి పథకం రావాలంటే 75 శాతం హాజరు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆన్‌లైన్‌లో ఈ హాజరు వివరాలు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యాప్‌లో ప్రతి రోజూ విద్యార్థుల హాజరు నమోదు చేయాలని స్పష్టం చేసింది. అమ్మ ఒడి పథకానికి ఈ నెల 8వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు ఉండే హాజరును ప్రామాణికంగా తీసుకోనున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో దీనిపై వ్యతిరేకత వస్తోంది.ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం.. నవంబర్ 8వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 23వ తేదీ వరకు 130 రోజుల పని దినాలు ఉంటాయి. ఇందులో 98 రోజుల హాజరున్న విద్యార్థికే అమ్మఒడి వర్తింపజేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి అమ్మ ఒడి పథకాన్ని విద్యార్థుల హాజరుతో అనుసంధానం చేయాలని సీఎం జగన్ ఇది వరకే అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లుగా కరోనా ఉంది కాబట్టే ఈ నిబంధన అమలు చేయలేదని, ఇక నుంచి తప్పనిసరిగా అమలు చేస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.15 వేలు జమ చేస్తున్న విషయం తెలిసిందే.జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి స్కీమ్ అత్యంత ముఖ్యమైనది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రతి ఏటా రూ. 15 వేలు చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది.ఇక, 2022 జనవరిలో అమలు చేయాల్సిన అమ్మఒడి పథకాన్ని.. జూన్ నెలలో అమలు చెయ్యాలని కేబినెట్ నిర్ణయించింది. విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే పథకం వర్తిస్తుందని.. ఈ మేరకు ప్రచారం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Related Posts