హైదరాబాద్
నగర శివారు రాజేంద్రనగర్ లో ఏటీఎం దొంగ దొరికిపోయాడు. సోమవారం రాత్రి ఏటీఎం లో చోరికి దుండగుడు విఫలయత్నం చేసి. రెడ్ హ్యాండెడ్ గాదొరికిపోయాడు. బండ్లగూడ ఆరె మైసమ్మ దేవాలయం సమీపంలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం లో కి యువకుడు చొరబడ్డాడు. వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్ తో ఏటీఎం మిషప్ తలుపును తెరిచాడు. డోర్ తెరచుకోవడం తో అలారం మోగింది. దాంతో అక్కడే గస్తీ తిరుగుతున్న రాజేంద్రనగర్ పోలీసులు ఏటీఎం వద్దకు చేరుకున్నారు. లోపల వున్న దొంగను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని వద్దనున్న రాడ్ ను స్వాధీనం చేసుకున్నారు. . రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.