వెంకన్న సన్నిధి తిరుమలలో మరోసారి మద్యం బాటిల్స్ కలకలం రేపాయి. విజిలెన్సు సిబ్బంది కళ్లుగప్పి మధ్యం ఇతర నిషేధిత వస్తువులను తిరుమలకు తీసుకువస్తున్నారు కొందరు దుండగులు. తిరుపతిలోని తనిఖీ కేంద్రంలో విజిలెన్స్ అధికారుల వైఫల్యం పలు మార్లు బయటపడింది. తాజాగా కొండమీద మద్యం బాటిల్స్ తరచూ తిరుమలలో విక్రయిస్తున్నారని పక్క సమాచారం రావడంతో తులసీ రామ్ అలియాస్ విక్రమ్ అనే మెస్త్రీ పై విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టారు. ఇంతకుముందులాగే, మద్యం మరలా విక్రయిస్తున్నాడని పక్క సమాచారం రావడంతో సోదాలు జరిపారు. విక్రమ్ ను రాంబగీచ బస్టాండ్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి దాదాపు 11 మధ్యం బాటిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తన ద్విచక్ర వాహనంలో తరచూ తిరుమలకు మద్యం బాటిల్స్ తీసుకు వస్తుంటాడు, తెలిసిన వాళ్ళకి, పరిచయం ఉన్న తాపీ పనులు చేసే వారికి అధిక ధరలకు మద్యం అమ్ముతుంటాడు. మధ్యం విక్రయించగా వచ్చే ఆదాయం అధికంగా ఉండటంతో ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నాడఇ పోలీసులు అంటున్నారు.