నల్గొండ, నవంబర్ 16,
నాగార్జునసాగర్‌లో కృష్ణా బోర్డుకు చెందిన 12 మంది బృంద సభ్యులు రెండు రోజుల పాటు పర్యటించి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ అంశాలను అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా రెండవ రోజు నాగార్జునసాగర్ డ్యాం, ఎడమ కాలువ, గ్యాలరీ, క్రస్ట్ గేట్లు, డైవర్స్ టన్నల్, రైట్ కెనాల్ గేట్లు పరిశీలించారు.అనంతరం హెల్ కాలనీ ఎస్సీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.నాగార్జున సాగర్ డ్యాం ప్రాజెక్ట్ నిర్వహణకు సంబంధించిన అంశాలతో ముసాయిదాను తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఎడమ కాలువ జలవిద్యుత్ కేంద్రం ప్రధాన జల విద్యుత్ కేంద్రంలోకి బృందం సభ్యులను అనుమతించలేదు.బృంద సభ్యుల్లో బీఆర్కే పిల్లే, బి రాయపూర్ ,ఆర్ టి కె శివరాజన్, అనుపమ్ ప్రసాద్ ప్రసాద్, మానాతంగ్, కోటేశ్వరరావు డి ఎస్ ప్రసాద్ శ్రీధర్ దేశ్‌పాండే, అశోక్ కుమార్, రఘునందన్ రావు, శ్రీనాథుడు రమేష్ బాబు, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. బృంద సభ్యులకు ఎన్ఎస్పీఎస్ఈ ధర్మ నాయక్, ఈఈ యలమందయ్య ప్రాజెక్ట్ సంబంధించిన విషయాలను వివరించారు.గార్జుసాగర్ డ్యాం ఎడమకాల్వ, డ్యాం గ్యాలరీ, క్రస్ట్ గేట్లు, డైవర్షన్ టన్నల్, రైట్‌కెనాల్ తూమ్ గేట్లులను పరిశీలించారు. ఎడమకాల్వ, డ్యాం ప్రధాన జలవిద్యుత్ కేంద్రాలలోకి కేఆర్‌యంబీ బృంద సభ్యులను అనుమతించ లేదు. అనంతరం హిల్‌కాలనీ ఎస్‌ఈ కార్యాలయంలో అధికారులతో బృందం సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకు ముందు నాగార్జునసాగర్ డ్యాం ప్రాజెక్ట్‌ను నిర్వహణకు సంబంధించిన అంశాలతో ముసాయిదాను తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. అంతకు ముందు నాగార్జునసాగర్ డ్యాం వద్ద సీపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, రాష్ట్ర నాయకులు పల్లా నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కేఆర్‌యంబీ బృంద సభ్యులకు డ్యాంల నిర్వహణపై వినతి పత్రాన్ని అందించారు.