గవర్నర్ కు ఏపీ ఎన్జీవో నాయకుడు అశోకీ బాబు మీద కంప్లైంట్ ఇస్తే ఏమవ్వుతుంది. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ బాధ్యత లేకుండా ప్రవర్తిసున్నారు. ప్రజలకు అన్యాయం చేస్తే మీకు ఓటు వేసి గెలిపించాలా...అశోక్ బాబు పై గవర్నర్ స్పందిస్తే , నేను గవర్నర్ ను కలుస్తా, ఎన్నికల మ్యానిఫెస్టో సమర్పిస్తా. ఏపీలో ప్రభుత్వాన్ని ఎవరు ఇబ్బంది పెట్టినా మేము అడ్డు పడతామని అన్నారు. ఐదు కోట్లు మంది ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ఇది. కర్ణాటకలో ఎన్నికల ను దృష్టిలో పెట్టుకుని , రాజకీయ పార్టీలు ఒక తాటిపైకి తెచ్చేందుకే నేను జాగారం చేస్తున్నా. ప్రధాని రాజకీయాల కోసం కౌన్సిలర్ కన్నా దారుణంగా మాట్లాడుతున్నారని శివాజీ విమర్శించారు. ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వోద్యోగులుగానే ఉండాలని అంటున్నారు. మరి ప్రధానమంత్రి ప్రధానమంత్రిగానే ఉంటున్నారా? హామీలు ఇచ్చి నెరవేర్చడం లేదు. వ్యక్తిగత విమర్శలు వద్దు.ఉద్యోగుల వెనకాల ఏపీ ప్రజలు ఉన్నారు. గవర్నర్ ఆయన ఉద్యోగం కోసం ఢిల్లీ - హైదరాబాద్ తిరుగుతున్నారు. ఈ ప్రాంతం అంటే నాకు పిచ్చి. నాకు ప్రాంతాభిమానం తప్ప రాజకీయాలు, కులాలు లేవని అన్నారు.