YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

టార్గెట్ 2024 దిశగా అమిత్ షా..

టార్గెట్ 2024 దిశగా అమిత్ షా..

హైదరాబాద్, నవంబర్ 17,
కేంద్ర హోమ్ మంత్రి హోదాలో సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనేందుకు  తిరుపతి వచ్చిన బీజేపీ కీలక నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు,అమిత్ షా స్వామి కార్యంతో పాటుగా స్వకార్యాన్ని చక్కపెట్టుకుని వెళ్ళారు. రాష్ట్రంలో మూడు రోజులున్న అమిత్ షా, చివరి రోజు సోమవారం పూర్తిగా రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టిని కేంద్రీకరించారు.రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఇంచార్జ్ సంతోష్ జీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు సుజన చౌదరి, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహ రావు, పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహా ఇంచార్జ్ సునీల్ ధియోధర్ ఇతర ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం చర్చలు ఎదో వచ్చాం కాబట్టి, నాలుగు మాటలు  మాట్లాడి  పోదాం అన్న విధంగా కాకుండా, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతో పక్కా ప్రణాలిక, అజెండాతో నిర్వహించి నట్లే ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడం అయ్యేపనేనా, అది సాధ్యమా అనే విషయాన్ని పక్కన పెడితే, షా చూపు ఏపీ మీద పడింది అనేది మాత్రం నిజమని అంటున్నారు.  ఈ సందర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరతీశాయని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రదానంగా అమిత్ షా మూడు విషయాలపై పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. అందులో  మొదటిది, ఒక రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలని కోరుతూ అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళన, పాద యాత్రకు బీజేపీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో మరో అభిప్రాయం, ఆలోచనకు తావు లేదని తేల్చి చెప్పారు. అమరావతి రైతుల ఆందోళనకు మద్దతు తెలియచేస్తూ పార్టీ తీర్మానం చేసిన తర్వాత, ఇక ఆ విషయంలో చర్చ ఎందుకని, రైతుల ఆందోళనకు రాజకీయ రంగులు అద్దుతున్న నాయకులకు గట్టిగా చురకలు అంటించారు. రాజదాని ఆందోళనను, రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా భూములు ఇచ్చిన రైతుల ఆందోళనగానే చూడాలని స్పష్టం చేశారు. అంటే, జగన్ రెడ్డి మూడు రాజధానుల గోల్ మాల్ వ్యవహారాన్ని, కేంద్ర ప్రభుత్వం సాగానీయదని చెప్పకనే చెప్పారు.రాష్ట్రంలో అధికార వైసీపీతో అంటకాగుతున్న నాయకులకు అమిత్ షా  చురకలు కాదు ఏకంగా వాతలే పెట్టారని సమాచారం. వైసీపీతో ఎలాంటి బంధం అనుబంధం లేదని, జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై ప్రజాఉద్యమాలను నిర్మించి, పార్టీ ఒంటరిగా ఎదిగేదుకు కృషి చేయాలని, నాయకులకు అమిత్ షా దిశా నిర్దేశం చేశారని పార్టీ నాయకుల సమాచారం. ఒక విధంగా చూస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం పై షా ..యుద్ధాన్ని ప్రకటించారని అనుకోవచ్చని పరిశీలకులు పేర్కొంటున్నారు. అదే సమయంలో ఎన్నికల పొత్తుల గురించి ఎవరూ మాట్లాడవద్దని, సరైన సమయంలో కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, అంతవరకు ఎవరూ పొత్తుల ప్రస్తావన చేయవద్దని స్పష్టంచేశారు. అలాగే, రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవ్వాలంటే, ఇతర పార్టీలలోని సీనియర్ నాయకులను పార్టీలోకి ఆహ్వానించి సముచిత స్థానం కలిపించాలని అన్నట్లు పార్టీ నాయకులఈ  సందర్భంగా ఆయన, అస్సాంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన హేమంత్ బిస్వా శర్మను ముఖ్యమంత్రిని చేసిన విషయాన్ని గుర్తు చేశారని  సమావేశంలో పాల్గొన్న ఒక ముఖ్యనేత తెలిపారు. అదలా ఉంటే అమిత్ షా ఒక్క సారిగా ఎపీపి ఇంతలా దృష్టిని కేంద్రీక రించడం ఏమిటే? ఇది దేనికి సంకేతం? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. షా పర్యటన  వెనక ఏదో అనూహ్య రాజకీయ  వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గడచిన రెండున్నర సంవత్సరాలలో అమిత్ షాతొలిసారిగా రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించడమే కాకుండా, మళ్ళీ జనవరి (2022) లో వస్తానని  ఈలోగా అమరావతి రైతుల ఆందోళనలో పార్టీ నాయకులు ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటుగా, వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించాలని క్లియర్ డైరెక్షన్’ ఇవ్వడంతో అమిత్  షా ఎత్తుగడ ఏమిటనే చర్చ జరుగుతోంది. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్వరం మారింది. కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ పైనా మంత్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రధాని మోడీని పేరు పెట్టి మరీ నానీలు తమ భాషలో విమర్శలు చేస్తున్నారు. మరో వంక జగన్ రెడ్డి  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ తో చేతులు కలిపి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు సాగిస్తునట్లు,ఇంటల్జెన్సీ వర్గాల సమాచారం ఉందని అందులో భాగంగా ఒరిస్సా ముఖ్యమంత్రితో రహస్య మంతనాలు సాగించడం వంటి, పరిణామాల నేపధ్యంలో  జగన్  రెడ్డికి  చెక్ పెట్టేందుకే, అమిత్ షా స్టేట్’లో  పావులు కదుపుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. అదే నిజం అయితే, జగన్ రెడ్డికి ముందుంది ముసళ్ళ పండగే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Related Posts