కర్నాటకలో అందరూ బీజేపీ కి పట్టం కట్టడానికి సిద్ధమవుతున్నారు. యడ్డి-మోడీ కాంబినేషన్ మీదే కన్నడిగులు ఆశలు పెట్టుకున్నారని బీజేపీ నేత, ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. మీడియా కూడా బీజేపీ నే సింగల్ లార్జెస్ట్ పార్టీ అని రిపోర్ట్స్ ఇస్తున్నాయి. తెలుగు కన్నడిగుల అనుబంధం అనిర్వచనీయమైనది. రాయల వారి సామ్రాజ్యంలో హంపి రాజధానిగా అందరం కలిసే ఉన్నాము. తెలుగు ప్రజలు బీజేపీ మీద వచ్చిన పుకార్లను తిప్పికొట్టబోతున్నారని అయన అన్నారు. కర్నాటకలో మూడింట రెండు వంతులు సీట్లు బీజేపీ వే. పురందేశ్వరి కర్ణాటకలో బీజేపీ గెలుపుకోసం అహర్నిశలు కష్టపడుతున్నారని అయన అన్నారు.
బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కర్ణాటకలో కోటిమంది తెలుగువాళ్లు క్రియాశీలంగా ఉన్నారు. దేశంలోనే సంచలన మైన కేస్ ఓట్ ఫర్ నోట్ కేసు. వోట్ ఫర్ నోట్ కేసు విషయం లో బీజేపీ కి సంబంధం లేదు. బీజేపీ మీద టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని అన్నారు. న్యాయపరమైన విషయాల్లో బీజేపీ కల్పించుకోదు. అది తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాల మధ్య విషయం. మా పరిధిలో లేని అంశాన్ని మామీద రుద్దుతున్నారని విమర్శించారు. తెరాస పార్టీ మాకు మిత్రపక్షం కాదు. రేవంత్ రెడ్డి కి బీజేపీ 50 లక్షలు ఇచ్చి పంపలేదని అన్నారు. ఏపీ ఎన్జీవో ప్రెసిడెంట్ ప్రచారం చేస్తూ ఎలక్షన్ కమిషన్ కి అడ్డం గా దొరికి పోయారు. అశోక్ బాబు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. నువ్వొక దళారివి. బీజేపీ నేతలు ను రాజీనామా చేయమనటానికి నువ్వెవరు. నీ సలహాలు తీసుకునే స్థాయిలో బీజేపీ లేదు. అశోక్ బాబు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.