లక్నొ, నవంబర్ 17,
ఉత్తరపదేశ్ శాసనసభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియంకా వాద్రా గట్టి ప్రయత్నం చేస్తున్నారు.ఇతర పార్టీల కంటే ఒకడుగు ముందుగానే, ప్రియాంక ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గానూ కేవలం ఏడు స్థానాలను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, రేపటి ఎన్నికల్లో అధికారంలోకి వస్తే, ఏమేమి చేస్తుందో చెపుతూ ప్రచార యాత్ర సాగిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, ముస్లిములు, యువతను ఆకర్షించేందుకు ప్రియాంక వ్యూహాత్మకంగా పవులు కదుపుతున్నారు.మహిళలలకు సంవత్సరానికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలెండర్లు, ఆశా,అంగన్‌వాడీ మహిళలకు ప్రతి నెల రూ.10 వేల గౌరవవేతనం.కొత్త ప్రభుత్వ ఉద్యోగాల్లో 40 శాతం మహిళలకు రిజర్వేషన్. నెల నెలా వెయ్యి రూపాయల వితంతు పింఛను, విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్లు, స్కూటీలు పంపిణీ వంటి ఉచిత వరాలు వాగ్దానం చేశారు. ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఎన్ఆర్సీ, సీఏఏ అమలు చేయమని వాగ్దానం చేశారు. ఇవిగాక మహిళలకు 50 శాతం అసెంబ్లీ టికెట్లు.. ఇంకా ఇతర వాగ్దానాలు, వరాలు ఎదజల్లుతున్నారు. అయితే ఏబీపీ-సీవోటర్స్-ఐఏఎన్‌ఎస్ నిర్వహించిన తాజా సర్వే ఉత్తర ప్రదేశ్ తో పాటుగా వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగే, ఐదు రాష్ట్రాలలో ఒక పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలలోనూ తిరిగి బీజేపీనే అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పింది. మిగిలిన రాష్ట్రాల సంగతి పక్కన పెట్టి, కాంగ్రెస్ అభిమానుల్లో ప్రియాంక వాద్రా ఆశలు రేకెత్తిస్తున్న ఉత్తర ప్రదేశ్ విషయాన్నే తీసుకుంటే, ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే ఒకే ఒక్క సీటు మాత్రమె ఎక్కువ వస్తుందని సర్వే చెపుతోంది. గత ఎన్నికల్లో 7 సీట్లతో సరిపెట్టుకున్న హస్తం పార్టీ ఈసారి 8 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని అంటోంది.మరో వంక బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చినా, ఆ పార్టీ రేపటి ఎన్నికల్లో వందకు పైగా స్థానాలు కోల్పోతుందని సర్వే చెపుతోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 325 సీట్లను సొంతం చేసుకున్నాయి. అనూహ్య ఫలితాన్ని సాధించాయి. వచ్చే ఏడాది ఎన్నికల్లో మాత్రం బీజేపీ/ ఎన్డీయే 108 స్థానాలను కోల్పోనుందని సర్వే తేల్చింది. అయినా.. 217 సీట్లను సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని వివరించింది. అదే సమయంలో గత ఎన్నికల్లో 48 సీట్లతో సరిపెట్టుకున్న సమాజ్‌వాదీ పార్టీ, దాని మిత్రపక్షాలు.. ఈ సారి 156 సీట్లను దక్కించుకునే అవకాశముందని తెలిపింది. అంటే ఒక సీటు అటూ ఇటుగా బీజీపే కోల్పోయే ప్రతి సీటు సమాజ్ వాదీ ఖతాలోకే చేరుతోంది. మరో వంక బీజీపే సీట్ల విషయంలో చాలా తేడా కనిపిస్తున్నా.. ఓట్ల శాతం విషయంలో బీజేపీకి పెద్దగా నష్టం ఉండదని పేర్కొంది. బీఎస్పీకి ప్రస్తుతమున్న 19 సీట్లలో ఒక సీటు తగ్గనుందని, కాంగ్రెస్ 7 నుంచి 8 పెరుగుతుందని తెలిపింది. మరో కో పైలట్ జితేంద్ర ప్రసాద(యూపీ) కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్న పైలట్ మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నారు. అయితే ఈ సారి కూడా గెహ్లాట్ మొండి చేయి చూపిస్తే, పైలట్ కమలదళంలో చేరవచ్చని అంటున్నారు.