YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కవితకు రాజ్యసభ సీటు బండ ప్రకాష్ కు మంత్రి పదవి..?

కవితకు రాజ్యసభ సీటు బండ ప్రకాష్ కు మంత్రి పదవి..?

హైదరాబాద్, నవంబర్ 17,
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… చక్రం తిప్పుతున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముదిరాజు సామాజికవర్గానికి చెందిన.. రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ కు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు సీఎం కేసీఆర్.ఎమ్మెల్సీ ఇవ్వటమే కాకుండా.. తెలంగాణ కేబినెట్లోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే బండ ప్రకాష్ రాజ్యసభ స్థానం లో.. తన కూతురు కల్వకుంట్ల కవిత ను రాజ్యసభ కు పంపే యోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగానే.. బండ ప్రకాష్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు సమాచారం అందుతోంది. జనవరి 4 వ తేదీన కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవి ముగియ నుంది. ఆ తర్వాత రాజ్యసభకు కవిత వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె మొదటి నుంచి ఎమ్మెల్సీ పదవి పై అసంతృప్తిగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.టిఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి వరకు ఆయన పేరు ప్రస్తావనే లేకున్నా.. ఒక్కసారిగా తెరపైకి వచ్చారు బండ ప్రకాష్.బండ ప్రకాష్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా తెలంగాణ మంత్రిత్వ శాఖలో బెర్త్ ఖరారు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ ను… ఎమ్మెల్సీగా చేసేందుకు సన్నద్ధమయ్యారు సీఎం కేసీఆర్. ఈటల రాజేందర్… స్థానాన్ని భర్తీ చేసేందుకే ముదిరాజు సామాజికవర్గం నుంచి.. బండ ప్రకాష్ ను తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. బండ ప్రకాష్ తో పాటు త‌క్కెళ్ల‌ ప‌ల్లి ర‌వీంద‌ర్‌రావు, కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్లు ఖరారు చేసింది టిఆర్ఎస్ పార్టీ.

Related Posts