మెదక్
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూముల వ్యవహారంలో బుధవారం రెండవరోజు సర్వే జరిగింది. మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామం లో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ , కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న భూ కబ్జా ఆరోపణ పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే తూప్రాన్ డివిజన్ అధికారి సర్వే నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. బుధవారం నాడు అచ్చంపేట గ్రామం లో గల సర్వే నంబర్ 77,78,79,80,81,82,లలో సర్వే చేసారు. ఈ సర్వే నంబర్లలో జమున హెచరీస్ కి సంబంధించిన ఈటెల జమున, ఈటెల నితిన్ తో పాటు అచ్చంపేట గ్రామానికి చెందిన నలుగురు రైతులకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ముందస్తు నోటీసులు ఇచ్చారు.