YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అసెంబ్లీ సమావేశాల్లో 14 ఆర్డినెన్సుల బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం గురువారం అసెంబ్లీ సమావేశం

అసెంబ్లీ సమావేశాల్లో 14 ఆర్డినెన్సుల బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం  గురువారం అసెంబ్లీ సమావేశం

వెలగపూడి
రాష్ట్ర శాసనసభ గురువారం ఒకరోజు సమావేశం కానుంది. అదేరోజు ఉదయం 8:30 గంటలకు శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ, 9:30 గంటలకు శాసనమండలి వ్యవహారాల సలహా కమిటీ సమావేశాలు నిర్వహించి ఉభయ సభల్లో చర్చించాల్సిన, పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. గురువారం సమావేశంలో మహిళా సాధికారతపై స్పల్పకాలిక చర్చ చేపట్టే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. బడ్జెట్‌ ప్రవేశ పెట్టడానికి ఈ ఏడాది మే 20న ఒకరోజు అసెంబ్లీ సమావేశమైంది. అది జరిగి శుక్రవారానికి ఆరు నెలలు అవుతుంది. ఆరు నెలలు ముగిసేలోపు అసెంబ్లీని మళ్లీ సమావేశపరచాల్సి ఉంటుంది. అందుకే గురువారం ఒకరోజు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో వారం/పది రోజులపాటు పూర్తిస్థాయి సమావేశాలను నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఎనిమిది జిల్లాల పరిధిలోని 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఏకగ్రీవమైతే మాత్రం అసెంబ్లీ సమావేశాలు ఈ నెలాఖరులోనే మళ్లీ జరగొచ్చు. ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్‌ జరిగే పరిస్థితి వస్తే డిసెంబరు మూడోవారంలో సమావేశాలను నిర్వహించవచ్చని ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం. అయితే ఈ ఏడాది జులై 27 నుంచి నవంబరు 9వ తేదీ మధ్య రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మొత్తం 14 ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులను సమావేశల్లో ప్రవేశపెట్టే అవకాశముంది. రాష్ట్రంలోని ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ప్రభుత్వ గ్రాంటు నిలిపివేత, వ్యవసాయ భూములకు ‘‘ల్యాండ్‌ పార్సిల్‌ నంబరు’’ ఇచ్చేలా వీలు కల్పించే చట్ట సవరణలతోపాటు మద్యం విక్రయిస్తూ వ్యాపార నిర్వహణే ప్రధాన విధిగా ఉన్న ఏపీ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌)కు సంక్షేమ పథకాలు అప్పగించే కీలక చట్ట సవరణల ఆర్డినెన్సులూ జాబితాలో ఉన్నాయి. సినిమా టికెట్లకు సంబంధించిన, భూములు, పట్టాదారు పాసుపుస్తకాలకు సంబంధించిన, మున్సిపల్‌ కార్పొరేషన్లకు సంబంధించిన  ఆర్డినెన్సుల బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Related Posts