హైదరాబాద్
ఆర్బీల్ బ్యాంక్ పేరుతో మోసం చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు ఆరెస్టు చేసారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలు మీడియాకు వెల్లడించారు. వీరంతా ఆర్బీఎల్ బ్యాంకు నుండి కాల్ చేస్తున్నామని మోసం చేస్తున్నారు. అమాయక ప్రజలను చీట్ చేసి 3 కోట్లు కొల్లగొట్టినట్లు నిర్దారించాం. ఆర్బీల్ బ్యాంకు లో పనిచేసిన ఉద్యోగే ఫేక్ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి చీటింగ్ చేశాడు. దేశ వ్యాప్తంగా 3 కోట్ల మేర చీట్ చేశారని అయన అన్నారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్ ఉజ్జయిని లో ఉన్న రెండు ఫేక్ కాల్ సెంటర్ల మీద రైడ్ చేశాం. 23 మంది లో 16 మందిని అదుపులోకి తీసుకున్నాం.. ఏడుగురు పరారీలో ఉన్నారు. నిందితుల నుండి మూడు కార్లు, 865 ఫేక్ ఆధార్ కార్డులు, వెయ్యి సిమ్ కార్డులు, 34 మొబైల్స్, పలు బ్యాంకు బుక్ లతో పాటు 15 లక్షల నగదు ఫ్రీజ్ చేశామని అన్నారు.