అందాల పోటీలో తోటి పోటీదారులతో సమంగా అందాలను ఆరబోసే తొందరలో ఓ మోడల్ చూపించిన అత్యుత్సాహం ఆమె ప్రాణాల మీదుకు తెచ్చింది. తాను ధరించిన వినూత్న వస్త్రాలతో ర్యాంప్‌పై వయ్యారాలు వలకపోస్తూ వాక్ చేస్తున్న క్రమంలో ఆమె తలపై డిజైన్ చేసిన ప్రత్యేక అలంకరణకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దాంతో అప్పటివరకూ సందడిగా ఉన్న వేదికపై భయానక వాతావరణం నెలకొంది. తలపై ధరించిన ప్రత్యేక డిజైన్ ఆలంకరణ మంటల్లో కాలిపోయినప్పటికీ అదృష్టవశాత్తూ ఆ మోడల్ ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ఘటన ఎవన్ సాల్వడోర్‌లో చోటుచేసుకుంది.
ఎలా జరిగిందంటే.. అందాల పోటీలో భాగంగా వేదికపై ఓ మోడల్ ర్యాంప్ వాక్ చేస్తూ ముందుకు వస్తున్న క్రమంలో ఇరువైపుల ఇద్దరు వ్యక్తులు కాగడ పట్టుకుని నిలబడ్డారు. ఈ సమయంలో ఆమె తలకు ధరించిన డిజైన్ ఆలంకరణ అంచునకు కుడివైపున ఉన్న వ్యక్తి కాగడ మంట అంటుకుంది. అంతే క్షణాల్లో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. అప్రమత్తమైన అక్కడి నిర్వహణ అధికారుల్లో ఇద్దరు మంటలను ఆర్పడంతో ఆ మోడల్‌కు ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను మీరూ చూడండి..