YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మహనంది దేవస్థానం లో అంత మాయ భక్తుడు ఇచ్చిన హరం.. రికార్డు లో ఎక్కని వైనం.

మహనంది దేవస్థానం లో అంత మాయ భక్తుడు ఇచ్చిన హరం.. రికార్డు లో ఎక్కని వైనం.

నంద్యాల
అమ్మవారి బంగారు కాసుల హారం గల్లంతు పై నామమాత్ర విచారణ చేపట్టారని  భక్తుల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహానంది క్షేత్రం లో వెలసిన శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారి కి ఓ భక్తుడు ఆరు తులాల బంగారు కాసులు ఆహారాన్ని గత మూడు సంవత్సరాల క్రితం వితరణ చేయడం జరిగిందన్నారు. అంతవరకూ బాగానే ఉన్నాఆలయ  రికార్డులకు ఎక్కకుండా కొందరు కిందిస్థాయి సిబ్బంది లాలూచీపడి బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం పొందినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి .తర్వాత ఈ విషయం బయటకు పొక్కడంతో ప్రైవేట్ బ్యాంకు నుండి అమ్మవారి కాసులు హారాన్ని విడిపించి ఉన్నట్లు సమాచారం .భక్తులు భక్తిభావంతో స్వామి అమ్మవార్లకు సమర్పించారు వీటిని సరైన సమయంలో రికార్డులో నమోదు చేయకపోవడంతో పాటు తమ ఇష్టం వచ్చినప్పుడు తమ ఇష్టానుసారంగా వాడుకొని రికార్డుల్లో నమోదు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం .అధికారుల పర్యవేక్షణ లోపంతో పాటు కింది స్థాయి ఉద్యోగులు చేసే తప్పులకు పై స్థాయి ఉద్యోగులు కూడా బలి  అవుతున్నట్లు సమాచారం .ఇందులో భాగంగానే దర్యాప్తు చేసిన దేవాదాయశాఖ అధికారులు పై స్థాయి అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు కింది స్థాయి ఉద్యోగులను షోకాజ్ నోటీసులతో సరిపెట్టడం చర్చనీయాంశంగా మారింది  .తాము కోరుకున్న పోస్టు లోనేచర్యలు తీసుకోవాల్సిన  కింది స్థాయి ఉద్యోగులనునియమించడం పలు విమర్శలకు తావిస్తోంది   .అవినీతి అక్రమాలకు మహానంది దేవస్థానం కేంద్రబిందువుగా మారినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు .ఏసీబీ అధికారులతో విచారణ జరిపిస్తే పలు  ఆసక్తికర విషయాలు వెలుగులోకి రావడంతో పాటు ఎంతమంది పీఠాలు కలుగుతాయో అని చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది .అధికారులు కూడా అయినవారికి ఆకుల్లో కానీ వారికి కంచాల్లో అందిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి .స్వామి అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకలకు లెక్కలు మరియు భద్రత లేకపోతే ఆలయ అభివృద్ధి ఎలా జరుగుతుందని పలువురు భక్తులు అంటున్నారు.

Related Posts