YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గులాబీలో పదవుల పండుగ

గులాబీలో పదవుల పండుగ

హైదరాబాద్, నవంబర్ 17,
హుజురాబాద్‌ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపుతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు గట్టి షాక్ తగిలింది. ప్రభుత్వ పథకాల పేరుతో కోట్ల రూపాయలు గుమ్మరించినా, మంత్రులు, ఎమ్మెల్యేలను మోహరించినా కూడా టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవడం పట్ల కేసీఆర్‌ విస్మయం చెందారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న గులాబీ దళపతి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అయినా ఈటలను ఓడించి తన పంతం నెగ్గించుకోవాలన్న లక్ష్యంతో ఇప్పటి నుంచి ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే కుల, సామాజిక వర్గాల ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారికి పదవులు కట్టబెడుతున్నారుఇందులో భాగంగానే హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన నేతలకు కార్పొరేషన్ పదవులు అప్పగించగా.. తాజాగా మరో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టడం విశేషం. హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలోతమే లక్ష్యంగా పాలువు కదుతుపున్న కేసీఆర్ ఇందులో భాగంగానే వకుళాభరణం కృష్ణమోహన్‌కు బీసీ కార్పొరేషన్, బండా శ్రీనివాస్‌కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించారు. తాజాగా రెడ్డి సామాజిక వర్గం నుంచి పాడి కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఉపఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగా ఓటమిపాలయ్యారు. తాజాగా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను ఆయనకే అప్పగించారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్‌ జిల్లాల్లో ఈటల రాజేందర్‌కు పట్టుండటంతో పెద్దపల్లికి చెందిన సిద్దిపేట కలెక్టర్‌గా రాజీనామా చేసిన వెంకట్రామరెడ్డికి, వరంగల్‌ జిల్లాకు చెందిన కడియం శ్రీహరికి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. తనకు గర్వభంగం చేసిన ఈటల రాజేందర్‌ను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఇప్పటినుంచే పాలువు కదులుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈటల రాజేందర్ ముదిరాజ్ కులానికి చెందిన బలమైన నేత. తాజా ఉపఎన్నికలతో కలిసి ఆయన వరుసగా ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచారంటేనే అక్కడ ఆయనకు ఎంత బలముందో అర్థం చేసుకోవచ్చు. తనకున్న ప్రజాబలానికి తోడు ఇతర పార్టీల నుంచి నేతలను బీజేపీలో చేర్పించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించుకోవాలని ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈటల ప్రయత్నాలను అడ్డుకోవడంతో పాటు ఈసారి ఆయన్నే ఓడించాలని కేసీఆర్ సంకల్పించారు. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న బండ ప్రకాశ్‌‌తో రాజీనామా చేయించి మరీ ఎమ్మెల్సీగా నామినేషన్ వేయించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన వెంటనే బండ ప్రకాశ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారన్న ప్రచారం ఉంది. ప్రకాష్‌కు మంత్రి పదవి ఇస్తే ముదిరాజ్ సామాజిక వర్గంలో టీఆర్ఎస్‌ బలం పెంచుకోవచ్చని కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈటల పార్టీని వీడటంతో తమకు మంచి పదవులు వస్తున్నాయని టీఆర్ఎస్ నేతలు సంబరపడిపోతున్నారు.

Related Posts