YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

డిజిటల్ గోల్డ్ తో సేఫ్టి

డిజిటల్ గోల్డ్ తో సేఫ్టి

ముంబై, నవంబర్ 18,
డిజిటల్‌‌‌‌ గోల్డ్‌‌ బిజినెస్‌‌కు పెద్ద దెబ్బే తగిలింది. ఇక నుంచి రిజిస్టర్డ్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ అడ్వైజర్లు (ఆర్‌‌ఐఏలు) డిజిటల్ గోల్డ్‌‌, క్రిప్టో వంటి అన్‌‌రెగ్యులేటెడ్‌‌ ప్రొడక్టులను అమ్మొద్దని సెబీ కొన్ని రోజుల క్రితం ఆదేశాలు ఇచ్చింది. దీంతో చాలా ఫిన్‌‌టెక్‌‌ కంపెనీలు నేరుగా డిజిటల్‌‌ గోల్డ్‌‌ అమ్మకాలను నిలిపేశాయి. తమ అన్‌‌రెగ్యులేటెడ్‌‌ పేరెంట్‌‌ కంపెనీలకు డిజిటల్ గోల్డ్‌‌ బిజినెస్‌‌లను బదిలీ చేశాయి. ఇది వరకే కొన్నవారికి డబ్బును వాపసు ఇస్తున్నాయి. అన్‌‌రెగ్యులేటెడ్‌‌, నాన్‌‌బ్రోకింగ్‌‌ కంపెనీలు మాత్రమే డిజిటల్‌‌ గోల్డ్‌‌ను అమ్ముతున్నాయి. డిజిటల్ గోల్డ్‌‌‌‌, క్రిప్టో కరెన్సీలను ప్రభుత్వం కంట్రోల్‌‌ చేయకపోవడంపై (రెగ్యులేటరీ మెకానిజం) కస్టమర్లు ఆందోళన చెందుతుండంతో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)  వీటిని తన అధీనంలోకి తీసుకువచ్చేందుకు రంగంలోకి దిగింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ,  సెబీ, ఆర్‌‌బీఐ  క్రిప్టో ఆస్తులతో పాటు డిజిటల్ బంగారాన్ని కొంత రెగ్యులేటరీ కంట్రోల్‌‌లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి.  ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి కొందరు డిజిటల్‌‌ గోల్డ్‌‌, క్రిప్టో సెల్లర్లు సాధ్యం కాని వాగ్దానాలు చేస్తున్నారని, భారీ రాబడులను ఆశచూపుతున్నారనే ఫిర్యాదులు ఎక్కువ అవుతున్నాయి. అందుకే ఇట్లాంటి అసెట్ క్లాసులకు పారదర్శకతను, రెగ్యులేటరీ కంట్రోల్‌‌ను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. డిజిటల్ గోల్డ్‌‌ను   సెక్యూరిటీగా వర్గీకరించడానికి ప్రభుత్వం సెబీ చట్టం,  సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ చట్టాన్ని సవరించే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.డిజిటల్ బంగారాన్ని సెక్యూరిటీలుగా వర్గీకరించేందుకు సెబీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. రానున్న బడ్జెట్‌‌లో ఇందుకోసం ఒక బిల్లును తేనుంది. “సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ (రెగ్యులేషన్) యాక్ట్ (ఎస్సీఆర్‌‌ఏ)  సెబీ యాక్ట్‌‌లో మార్పులు తేవడం ద్వారా  డిజిటల్ బంగారాన్ని సెక్యూరిటీలుగా పేర్కొంటారు. అప్పుడు డిజిటల్ గోల్డ్‌‌ నియంత్రణ సంస్థల పరిధిలోకి వస్తుంది. ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ అడ్వైజర్లు,  బ్రోకర్లు డిజిటల్ గోల్డ్‌‌ను అమ్మవచ్చు’’ అని సెబీ సీనియర్‌‌ ఆఫీసర్లు కొందరు వివరించారు.  సెబీ చట్టానికి సవరణలు చేయడం వల్ల డిజిటల్‌‌ గోల్డ్‌‌ను గోల్డ్ ఎక్స్ఛేంజీలకు లింక్ చేయవచ్చని చెప్పారు.  సెబీ నియంత్రణ పరిధిలోకి వచ్చేలా ప్రభుత్వం రెగ్యులేటెడ్‌‌ గోల్డ్ ఎక్స్ఛేంజీల ఏర్పాటును మొదలుపెట్టింది.  గోల్డ్ ఎక్స్ఛేంజీల నిర్వహణ కోసం తయారు చేసిన  ఫ్రేమ్‌‌వర్క్‌‌ను సెబీ ఆమోదించింది.  ఇది అమల్లోకి వస్తే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్ల ద్వారా గోల్డ్‌‌లో ట్రేడింగ్‌‌ చేయవచ్చు. డిజిటల్ గోల్డ్‌‌కు సంబంధించిన సమస్యలు వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తిగా పరిష్కారమవుతాయని సెబీ భావిస్తోంది. అయితే క్రిప్టో ఆస్తులను ఎవరు నియంత్రించాలనే దానిపై ఆర్‌‌బీఐ, సెబీ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.  క్రిప్టో ఆస్తులను రెగ్యులేటర్‌‌ పరిధిలోకి తేవడం,  దానిపై పన్నులను విధించే బిల్లును ఆర్థిక మంత్రిత్వశాఖ తయారుచేస్తోంది.క్రిప్టో ఆస్తుల కోసం ఒక వ్యూహాన్ని ఖరారు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెగ్యులేటర్లతో  ఇప్పటికే సమావేశమయ్యారు. 'క్రిప్టో ఫైనాన్స్‌‌‌‌లో అవకాశాలు  సవాళ్లు'పై రెగ్యులేటర్ల అభిప్రాయాలను తీసుకోవడానికి సంబంధిత స్టాండింగ్ కమిటీ సోమవారం ప్రత్యేకంగా మీటింగును కూడా నిర్వహించింది. క్రిప్టో అసెట్లపై అసోసియేషన్లతో, ఇండస్ట్రీ ఎక్స్‌‌పర్టులతో సంప్రదింపుల కోసం స్టాండింగ్ కమిటీ నోటీసును కూడా జారీ చేసింది. అయితే డిజిటల్ గోల్డ్‌‌ను రెగ్యులేటరీ కంట్రోల్‌‌లోకి తీసుకొచ్చే విషయమై సెబీకి,  ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపిన ఈ–మెయిళ్లకు జవాబు రాలేదు. ఇక నుంచి క్రిప్టో వంటి ఇన్వెస్ట్‌‌మెంట్లను రిజిస్టర్డ్ బ్రోకర్లు, ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ అడ్వైజర్లు అందించకుండా సెబీ నిషేధం విధించింది.  రెగ్యులేటరీ సంస్థలు క్రిప్టో, డిజిటల్‌‌ గోల్డ్‌‌ ప్రొడక్టులను అందించడం సెబీ చట్టాన్ని ఉల్లంఘించడమేనని ప్రకటించింది. రూల్స్‌‌ పాటించకుంటే జరిమానాలు విధిస్తామని, అవసరమైతే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది. దీంతో కొన్ని ఫిన్‌‌టెక్ కంపెనీలు డిజిటల్ గోల్డ్ అమ్మకాలను నిలిపివేయాల్సి వచ్చింది.  మరికొన్ని తమ తమ అన్‌‌రెగ్యులేటెడ్‌‌ పేరెంట్‌‌ కంపెనీలకు డిజిటల్ గోల్డ్‌‌ బిజినెస్‌‌ను బదిలీ చేశాయి. కొన్ని కంపెనీలు డిజిటల్‌‌ గోల్డ్‌‌ను ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ప్రొడక్టుగా అమ్ముతున్నాయి. నిషేధం వర్తించదు కాబట్టి ఆర్‌‌బీఐ నియంత్రణలో లేని సంస్థలు ఎటువంటి పెనాల్టీలు లేకుండా డిజిటల్ బంగారాన్ని అమ్ముతున్నాయి. బ్రోకరేజీలు మాత్రం ఈ బిజినెస్‌‌కు దూరమయ్యాయి. "ఆర్‌‌బీఐ రూల్స్‌‌ కారణంగా డిజిటల్ బంగారాన్ని మేం అమ్మడం లేదు. డిజిటల్‌‌ గోల్డ్‌‌ మంచి ప్రొడక్టని మేం ఎప్పుడూ అనుకోలేదు’’ అని బ్రోకరేజీ ప్లాట్‌‌ఫారమ్ జెరోధా చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఫౌండర్‌‌ నితిన్ కామత్ అన్నారు.

Related Posts