YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఎన్ఐయే సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఎన్ఐయే సోదాలు

హైదరాబాద్/అమరావతి
రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ మావోయిస్టులు, వివిధ సంఘాల నాయకుల ఇళ్లల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. హైదరాబాద్ లోని నాగోల్ లో రవిశర్మ ,  భవాని  ఇళ్లల్లో  సోదాలు జరిగాయి. గతంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిని రవిశర్మ తరువాత లొంగిపోయారు.  ప్రకాశం జిల్లా లో కళ్యాణ్ రావు ఇంట్లో సోదాలు జరిగాయి. అల్వాల్ సుభాష్ నగర్ లో నివాసముంటున్న అమరుల బందు మిత్రుల సంఘం నేత పద్మ కుమారి ఇంట్లో పోలీసులుసోదాలు జరిపారు. విశాఖపట్నం ఆరిలోవ లో అడ్వకేట్ అన్నపూర్ణ ఇంటి లో కుడా ఎన్ ఎ ఐ సోదాలు జరిగాయి. గతంలో అన్నపూర్ణ ఇంటిపై పలుమార్లు సోదాలు నిర్వహించారు.  గురువారం ఉదయం నుండి ఈ సోదాలు కొనసాగాయి. సోదాల వివరాలు చెప్పడానికి అధికారులు నిరాకరించారు.

Related Posts