YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మందుల్లో మాయ

మందుల్లో మాయ

కంపెనీ, జనరిక్‌ మందులు చూడటానికి ఒకే విధంగా ఉంటాయి. పేరులో ఒక అక్షరం మార్పు మాత్రమే ఉంటుంది. సామాన్యులకు మెడికల్‌ దుకా ణాల నిర్వాహకులు ఇచ్చేది జనరిక్‌ మందులా.. లేక కంపెనీ మందులా? అనేది గుర్తుపట్టడం చాలా కష్టం. డాక్టర్‌ కంపెనీ మందులను ప్రిస్కిప్షన్‌పై రాస్తే నిర్వాహకులు మాత్రం రోగులకు జనరిక్‌ మందులనే అంటగడుతున్నారు. ఫార్ములాలో ఎలాంటి వ్యత్యాసం లేకపోవడంతో జబ్బు కూడా తగ్గుతుంది. అయితే కంపెనీ మందులకు- జనరిక్‌ వాటికి ధరలో వ్యత్యాసం ఉంటుం ది.

ఉదాహరణకు పది మాత్రల షీట్‌ ధర రూ. 150 అయితే మెడికల్‌ దుకాణ నిర్వాహకుడికి అది కంపెనీదైతే రూ.130కి లభిస్తుంది. ఇందు లో నిర్వాహకుడు ఆశించినంత లాభం రాదు. అదే ఫార్ములా కలిగిన మెడిసిన్‌ జనరిక్‌లో అయితే రూ. 150 ధర ముద్ర ఉన్నప్పటికీ నిర్వాహకుడికి రూ.40నుంచి రూ.50కే వస్తుంది. ఇందులో దాదాపు రూ. 100 వరకు లాభం వస్తుంది. అందుకే ఎక్కువ లాభం కోసం ఆశపడుతున్నా మెడికల్‌ దుకాణాల నిర్వాహకులు కంపెనీ మందుల పేరుతో జనరిక్‌ మందులను రోగులకు ఇస్తున్నారు. అయితే డాక్టర్లు మాత్రం ప్రిిస్కిప్షన్‌లో కంపెనీ మందులే రాయడం గమనార్హం. కంపెనీ మందులకు బదులు మెడికల్‌ దుకాణ నిర్వాహకుడు జనరిక్‌ మందులు విక్రయిస్తే దాదాపు 70 శాతం వరకు మిగులుతుందనేది ఒక అంచనా. అందుకే డాక్టర్లు రాసినదానికి బదులు నిర్వాహకులు కాసులకు కక్కుర్తిపడి జనరిక్‌ మందులను విక్రయిస్తున్నారు.

జనరిక్‌ మందుల విక్రయాల్లో వైద్యులకు కమీషన్‌ లభిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాను రాసిన మందుల ఫార్ములా ఉన్నా జనరిక్‌ మందులను కంపెనీ రేటుకే విక్రయించినందుకు నిర్వాహకులు కొంతమొత్తంలో డాక్టర్లకు ఇస్తున్నట్లు సమాచారం. సాధారణంగా జనరిక్‌ రేట్లకే నిర్వాహకులు రోగులకు మందులు విక్ర యిస్తే వారికి లాభం చేకూరుతుంది. కానీ కం పెనీ రేట్లకు జనరిక్‌ మందులు విక్రయించడం ద్వారా నష్టం ఎక్కువగా జరుగుతోంది. వనపర్తి జిల్లాలో వందల సంఖ్యలో మెడికల్‌ దుకాణాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దుకాణాల నిర్వాహకులు ఎక్కువగా ఆర్‌ఎంపీ, పీఎంపీలపైనే ఆధారపడతారు. ఈ క్రమంలో సదరు వైద్యులకు కమీషన్‌ ముట్టజెప్పుతుండటంతో వారు కూడా జనరిక్‌ మందులకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం నిర్వాహకుల కు 70శాతం మేరు మిగిలితే అందులో 30 నుం చి 40శాతం వరకు వైద్యులకు ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తోంది.

జిల్లాలో మెడికల్‌ దుకాణాలే ఆస్పత్రులుగా మారుతున్నాయి. అనుమతులు ఉన్నవి మెడిక ల్‌ దుకాణానికి అయితే ఆ నిర్వాహకులు మా త్రం యథేచ్ఛగా బోర్డులు ఏర్పాటు చేసుకుని కన్సల్టెంట్‌ డాక్టర్ల సాయంతో వ్యాపారం చేస్తున్నారు. అధిక శాతం దుకాణంలో అర్హత పొందిన ఫార్మాసిస్టు ఉన్నారా? అంటే అదీ లే దు. ఫార్మాసిస్టుల పేరుతో ఇతరులు దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. మెడికల్‌ దుకాణాల్లో తనిఖీలు చేయడం కానీ.. ఏ మందులు వాడుతున్నారు.. ఎంతకు విక్రయిస్తున్నారు.. బిల్లులు ఇస్తున్నారా లేదా అనే విషయాలను మాత్రం పట్టించుకోవడం లేదు. మెడికల్‌ దుకాణాలపైనే డాక్టర్లు ఆధారపడటంతో డాక్టర్‌ రాసేదొకటి.. నిర్వాహకులు ఇచ్చేదొకటి అన్నచందంగా పరిస్థితి తయారైంది.

Related Posts