సత్యసాయి బాబా 96వ జయంతి వేడుకలకు ముస్తాబైన పుట్టపర్తి వేణు గోపాల స్వామి రథోత్సవం తో ప్రారంభం కానున్న వేడుకలు పట్టణంలో పండుగ వాతావరణం.
అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో రేపటి నుంచి సత్యసాయి బాబా 96 వ జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. రేపు ఉదయం సత్యనారాయణ స్వామి పూజ అనంతరం వేణుగోపాల స్వామి రథోత్సవంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక పూలతో వేణుగోపాలస్వామి రథాన్ని సర్వాంగ సుందరంగా సాయి సేవకులు అలంకరించారు. విద్యుత్ దీప కాంతులతో ప్రశాంతినిలయం మెరిసిపోతోంది. బాబా సమాధి దర్శనానికి నిత్యం పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించనున్నారు.పట్టణంలో పచ్చని తోరణాలు ఏర్పాటు చేసి విచ్చేసే భక్తులకు సత్యసాయి దర్శనం ఏర్పాట్లు పూర్తి చేశారు.వచ్చిన భక్తులు సత్యసాయి మహాసమారిని దర్శించుకొని వెళ్లేందుకు మాత్రమే ఏర్పాట్లు చేశారు.వసతి,క్యాంటీన్ సౌకర్యాలను అనుమతించలేదు ట్రస్ట్.గత రెండేళ్లుగా కరోనా కారణంగా వేడుకలు నిర్వహించకపోవడంతో ఈ ఏడాది వేడుకల నిర్వహణ ను ట్రస్ట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే సాయి భక్తులు సాయి సేవకులతో పుట్టపర్తిలో పండుగ వాతావరణం నెలకొంది. భజన గీతాలాపన తో పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి. గురువారం నుంచి ఈ నెల 23 వరకు ప్రతిరోజు వివిధ సాంస్కృతిక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.