YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కాశీపురం జంక్షన్లో అర్ధరాత్రి పూట వైఎస్సార్ విగ్రహం

కాశీపురం జంక్షన్లో అర్ధరాత్రి పూట వైఎస్సార్  విగ్రహం

విశాఖపట్నం

కాశీపురం జంక్షన్లో అర్ధరాత్రి పూట వైఎస్సార్  విగ్రహం  కోర్టు ధిక్కార చర్య పై కేసు నమోదు చేయాలి  టిడిపి నాయకుల డిమాండ్..
ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి విరుద్ధంగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు పై తెలుగు తమ్ముళ్లు ఇది దోపిడి రాజ్యమా.. దొంగల రాజ్యమా... అంటూ వైసీపీ నేతల పనితీరు ద్వంద వైఖరికి మండిపడ్డారు.  దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని కాశీపురం వైసిపి నాయకులు అరాచకాలపై అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ ఆదిరెడ్డి వరలక్ష్మి సుధాకర్, మండల టిడిపి అధ్యక్షులు చిటిమిరెడ్డి సూర్యనారాయణ డిమాండ్ చేశారు.  కాశీపురం గ్రామం జంక్షన్లో పంచాయతీ అనుమతి లేకుండా స్థానిక వైసిపి నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని సోమవారం అర్ధరాత్రి ఏర్పాటు చేయడంపై స్థానిక టిడిపి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకపక్క జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న మరొక పక్క కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేసిన వైసీపీ నాయకుల పై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి దొంగచాటున వైఎస్ విగ్రహం ఏర్పాటు చేసి ఆ మహనీయుని అవమానపరచడం సిగ్గుచేటన్నారు. అధికారుల అనుమతి పొంది విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదన్నారు. స్థానిక సర్పంచ్, పంచాయతీ చట్టాన్ని కాదని ఎలా నిబంధనలకు విరుద్ధంగా విగ్రహం పెడతారని వైసిపి నాయకులు తీరుపై మండిపడ్డారు. జంక్షన్ కు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ ప్రయత్నం చేస్తున్నారని ఈలోపు ప్రజలకు,పాఠశాల విద్యార్థులకు ఆటంకం కలిగించే ఈ స్థలాన్ని కబ్జా చేసి దొంగచాటున విగ్రహం పెట్టడం అన్యాయమన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం  తప్ప విగ్రహాలను తొలగించే సంస్కృతి మాది కాదన్నారు. గతంలో ఈ స్థలాన్ని కబ్జా చేశారని కోర్టులో కేసులు వేశా మన్నారు.దీనికి సంబంధించిన పత్రాలను తహసిల్దార్, పోలీసులకు, ఆర్ అండ్ బి అధికారులకు అందజేశామన్నారు. దౌర్జన్యంగా విగ్రహం ఏర్పాటు చేస్తే సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోలేదని, ఈ విషయంలో అధికారులు కూడా జైలుకు పోయే పరిస్థితి ఉందన్నారు.  అంతకుముందు వైసిపి నాయకులు వ్యవహరించిన ప్రజావ్యతిరేక తీరుపై టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇది దొంగల రాజ్యంమా..దోపిడీ రాజ్యంమా అంటూ నినదించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇదిలా ఉండగా అక్టోబర్ 26న కబ్జా స్థలంలో పునాదులు నిర్మించే సమయంలో కాశీపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం అర్ధరాత్రి హఠాత్తుగా విగ్రహం నెలకొల్పడంతో పోలీసులు అప్రమత్తమై మంగళవారం తెల్లవారుజామున చోడవరం సీఐ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. ఒకపక్క టిడిపి కార్యకర్తలు ఆందోళన చేస్తుండగా, మరోపక్క  స్థానిక యువకులు వైయస్ విగ్రహానికి ముసుగు వేయడం గమనార్హం

Related Posts