YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాజ్ భవన్ కు సీఎం

రాజ్ భవన్ కు సీఎం

హైదరబాద్ నవంబర్ 18,
కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్‌ అధ్యక్షతన ఇందిరాపార్క్‌ వద్ద టీఆర్‌ఎస్‌ పార్టీ మహా ధర్న ముగిసింది. ఈ మేరకు ఎంపీ కేశవరావు నేతృత్వంలోని బృందం 10 మంది మంత్రులు,10 ఎంపీలు గవర్నర్నర్‌ను కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. వీరిలో గంగుల కమలాకర్, మంత్రి సత్యవతి రాథోడ్, కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కడియం శ్రీహరి, నారదాసు లక్ష్మణ్రావు, మంత్రులు నిరంజన్ రెడ్డి, తలసాని, శ్రీనివాస్ గౌడ్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే జోగు రామన్న, పద్మాదేవేందర్రెడ్డి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాలోత్ కవిత, భాను ప్రసాద్‌ ఉన్నారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి.. తెలంగాణ రైతుల ప్రయోజ‌నాల‌ను ప‌రిర‌క్షించేందుకు అవసరమైతే ఢిల్లీ వరకు యాత్ర చేస్తామని ప్రకటించారు. సీఎం, మంత్రులు ధర్నా చేసే పరిస్థితిని కేంద్రమే తీసుకొచ్చిందన్నారు. అద్భుతమైన పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నట్టే.. అంతకుమించిన పోరాటాలతో రైతాంగం ప్రయోజనాలు కాపాడుతామని రైతులకి భరోసానిచ్చారు. గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ 51 గంటల దీక్ష చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. కేంద్రం కళ్లు తెరిపించడానికే ఈ యుద్ధం చేస్తున్నామన్నారు. ఇందిరాపార్క్‌ దగ్గర జరుగుతున్న దీక్షలో వరి కంకులతోపాటు నాగలిని పట్టుకున్నారు ముఖ్యమంత్రి. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వ‌ద్ద చేప‌ట్టిన రైతు మ‌హాధ‌ర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.వ్యవ‌సాయం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందన్న సీఎం.. కేంద్రం విధానాల వ‌ల్ల మ‌న రైతాంగం దెబ్బతినే పరిస్థితి నెలకొందన్నారు. రైతాంగం, వ్యవ‌సాయం ప‌ట్ల కేంద్ర వైఖ‌రి మార్చుకోవాల‌న్న సీఎం.. రైతు నిరంకుశ చ‌ట్టాల‌ను విర‌మించుకోవాల‌న్నారు. ఈ యుద్ధం ఈరోజుతో ఆగిపోదని.. ఇది ఆరంభం మాత్రమే. అంతం కాదు.. మ‌న హ‌క్కులు సాధించే వ‌ర‌కు, రైతుల ప్రయోజ‌నాలు ప‌రిర‌క్షించేంత వ‌ర‌కు, ఉత్తర భార‌త‌దేశంలోని రైతుల పోరాట‌ల‌ను క‌లుపుకొని భ‌విష్యత్‌లో ఉధృతం చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఇక ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా ముగియగానే పార్టీ నాయకులతో కలిసి రాజ్‌భవన్‌ వెళ్లి ముఖ్యమంత్రి గవర్నర్‌కు వినతి పత్రం అందించారు.

Related Posts