YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

ఆదాయపున్న శాఖ గుడ్ న్యూస్

ఆదాయపున్న శాఖ గుడ్ న్యూస్

ముంబై, నవంబర్ 18,
ఆదాయ పన్ను శాఖ తీపికబురు అందించింది. పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగే ప్రకటన వెల్లడించింది. పన్ను చెల్లింపుదారులకు అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పిట వరకు పన్ను చెల్లింపుదారులకు 1లక్షా 19 వేల 93 కోట్ల రూపాయల రీఫండ్‌ను చేసింది. 1.02 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఈ రీఫండ్‌ చేసినట్లు సీబీడీటీ తెలిపింది. సీబీడీటీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 1,2021, నవంబర్‌ 15,2021 మధ్య ఆదాయపు పన్ను శాఖ 1,00,42,619 కేసుల్లో రూ.38,034 కోట్ల రీఫండ్‌ చేసినట్లు తెలిపింది. ఇది కాకుండా రూ.1,80,407 కార్పొరేట్‌ కేసులలో రూ.81.059 కోట్లను రీఫండ్‌ చేసినట్లు తెలిపింది. ఈ రీఫండ్‌లో 2021-22అసెస్‌మెంట్‌ సంవత్సరానికి రూ.67.99 లక్షల రీఫండ్‌ ఉంది. 2021-22 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి ఇప్పటి వరకు మొత్తం రూ.13వేల 141 కోట్ల రీఫండ్‌ జారీ చేసినట్లు పేర్కొంది.దీంతో చాలా మందికి ప్రయోజనం కలుగనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలుపై పన్ను చెల్లింపుదారుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆలస్య రుసుమును వసూలు చేసింది. అయితే కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో జరిగిన చిన్న తప్పిదం కారణంగా ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర సర్కార్‌ ఈ తప్పును సరిచేసింది. ఈ నేపథ్యంలోనే పన్ను చెల్లింపుదారులకు వారి నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ఖాతాదారులకు రీఫండ్‌ చేసింది.

Related Posts