YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

బాయిల్డ్ రైస్ తీసుకోం కుండ బద్దలు కొట్టిన కేంద్రం సీఎం కేసీఆర్ ధర్నాకు కౌంటర్

బాయిల్డ్ రైస్ తీసుకోం కుండ బద్దలు కొట్టిన కేంద్రం సీఎం కేసీఆర్ ధర్నాకు కౌంటర్

న్యూఢిల్లీ
పార్ బాయిల్డ్ రైస్ను తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. యాసంగి పంట ధాన్యం కూడా పరిమితంగానే కొంటామని పేర్కొంది. రబీ పంట సేకరణకు సంబంధించి రాష్ట్రాలతో చర్చించిన తర్వాత వచ్చే ఏడాది ఎంత సేకరించాలో నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కో రాష్ట్రం నుంచి డిమాండ్ ఒక్కో విధంగా ఉంటుంది. డిమాండ్లకు అనుగుణంగా రాష్ట్రాలతో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన నిర్ణయాల ప్రకారం బాయిల్డ్ రైస్ కేంద్రం కొనదు. వరి, గోధుమ పంటను తక్కువ పండించాలని రాష్ట్రాలను కోరుతున్నాం. ప్రస్తుతం.. దేశంలో నిల్వలు సరిపడా ఉన్నాయి. అవకాశం ఉన్నంత మేరకు ఎగుమతి చేయడానికి ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని సూచనలు చేస్తున్నాం. ఆయిల్, పప్పు ధాన్యాలు ఎక్కువ పండించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు చేస్తున్నాం. రాష్ట్రాలు ఎంత వరకు సేకరించగలుగుతాయో అంత వరకే పరిమితం కావాలని చెబుతున్నాం. అని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది.  తెలంగాణ రాష్ట్ర రైతులు పండిస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ మహాధర్నా చేస్తున్న రోజే కేంద్రం ఇలా కౌంటర్ ఇవ్వడం సంచలనంగా మారింది

Related Posts