YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వాళ్లిద్దరి మధ్య గొడవలే

వాళ్లిద్దరి మధ్య గొడవలే

గుంటూరు, నవంబర్ 19,
ఇద్దరు గొడవ పొడితే మూడో వారికి అది అడ్వాంటేజీగా మారుతుంది. వ్యాపారంలోనైనా, రాజకీయాల్లోనైనా ఇది సహజ సూత్రం. తాడికొండ నియోజకవర్గంలో ఇప్పుడు అదే జరుగుతుంది. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ల మధ్య విభేదాలు తొలి నుంచి ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ రంగ ప్రవేశం చేయడంతో మూడో వర్గం ఇక్కడ బలంగా ఉంది. దీంతో వారిద్దరి గొడవలు ఇప్పుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ కు మంచి చేస్తున్నాయంటున్నారు.ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎంపీ నందిగం సురేష్ లు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. సోషల్ మీడియాలో ఒకరి వర్గంపై మరొక వర్గం వ్యతిరేక పోస్టుల పెడుతూ పార్టీ పరువును బజారున పెట్టేశారు. నందిగం సురేష్ బాపట్ల ఎంపీ అయినా ఆయన సొంత ప్రాంతం ఇదే కావడంతో ఆయన ఇక్కడ పెత్తనం చేస్తున్నారు. ఇసుక రీచ్ ల విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి.మరోవైపు నందిగం సురేష్ తో విభేదించి తన వద్దకు వచ్చిన వారికి ఉండవల్లి శ్రీదేవి ప్రాధాన్యత ఇచ్చారు. ఇది విభేదాలకు మరింత కారణమయిది. దీంతో నందిగం వర్గం శ్రీదేవిపై ఇసుక, మైనింగ్ వంటి వాటిపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం ప్రారంభించింది. ఇది శ్రీదేవికి రాజకీయంగా ఇబ్బందిగా మారింది. దీంతో ఆమె నందిగం సురేష్ తో సఖ్యతకు ప్రయత్నించారు. కుటుంబంతో సహా కలసి నందిగం ఇంటికి వెళ్లి కలసి రాజీకి వచ్చారు.అయినా ఇద్దరి మధ్య నలిగిపోతున్న ద్వితీయ శ్రేణినేతలు ఇప్పుడు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వద్దకు వెళుతున్నారట. ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉండటంతో తమ సమస్యలను చెప్పుకునేందుకు డొక్కాయే బెటరని కొందరు గ్రామస్థులు కూడా తాడికొండ నియోజకవర్గం నుంచి రోజూ డొక్కా ఇంటికి వెళుతుండటం విశేషం. ఇద్దరి మధ్య విభేధాల కారణంగా ఇక్కడ డొక్కా మాణిక్యవరప్రసాద్ బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి నందిగం సురేష్, ఉండవల్లి శ్రీదేవిలు ఒక్కటిగా కన్పిస్తున్నా, క్యాడర్, నేతలు మాత్రం డొక్కానే ఆశ్రయిస్తుండటం విశేషం.

Related Posts