YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

సత్తా చూపించిన జియో

 సత్తా చూపించిన జియో

ముంబై, నవంబర్ 19,
టెలికాం రంగంలో జియో సత్తా చాటుతోంది. రోజురోజుకు జియో నెట్‌వర్క్‌ పెంచుకుంటోంది. ఇంటర్నెట్‌ విషయంలో, వాయిల్‌ కాలింగ్‌ విషయంలో ఏ నెట్‌వర్క్‌కు తగ్గకుండా దూసుకుపోతోంది. ఇప్పటికే అన్ని నెట్‌వర్క్‌లను వెనక్కినెట్టేసి ముందుకు సాగుతున్న జియో.. 4జీ నెట్‌వర్క్‌లో మరో రికార్డు సృష్టించింది. తాజాగా 4జీ సర్వీస్ ప్రొవైడర్లలో అత్యధిక సగటు డేటా డౌన్‌లోడ్ వేగం సెకనుకు 21.9 మెగాబిట్‌‌ను అందిస్తూ రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. టెలికాం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ ప్రకటించిన తాజా జాబితా ప్రకారం.. ఎయిర్‌టెల్‌, వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్.. డేటా డౌన్‌లోడ్ వేగాన్ని పెంచుతూ వచ్చాయి. అయితే 4జీ డేటా డౌన్‌లోడ్ వేగంలో స్వల్పంగా తగ్గుదల తర్వాత, జూన్‌ నెలలో నమోదు చేసిన 21.9 ఎంబీపీఎస్ వేగం స్థాయిని అక్టోబరులో జియో నెట్‌వర్క్ మళ్ళీ ప్రారంభించింది. ఎయిర్‌టెట్, వోడాఫోన్ ఐడియా డేటా డౌన్‌లోడ్ వేగంలో దాదాపు రెండున్నర రెట్లు పెరిగినట్లు ట్రాయ్‌ వెల్లడిస్తోంది.  ఎయిర్‌టెట్‌ 4జీ డేటా డౌన్‌లోడ్ వేగం జూన్‌లో 5 ఎంబీపీఎస్ ఉండగా, అదే అక్టోబరు నెలలో 13.2 ఎంబీపీఎస్‌కు పెరిగింది. ఇక విఐఎల్ 4జీ వేగం ఐదు నెలల్లో 6.5 ఎంబీపీఎస్ నుంచి 15.6 ఎంబీపీఎస్ కు పెరిగింది.కాగా, 4జీ డేటా అప్‌లోడ్‌ విషయంలో వీఐఎల్‌ అధిక్యాన్ని చాటించింది. అక్టోబరులో 4జీ డేటా 7.6 ఎంబీపీఎస్ అప్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది. ఇది గత ఐదు నెలల్లో అత్యధికం. ఎయిర్‌టెల్, జియో నెట్‌వర్క్ కూడా అక్టోబరు నెలలో తమ ఐదు నెలల గరిష్ట స్థాయి 5.2 ఎంబీపీఎస్, 6.4 ఎంబీపీఎస్ 4జీ డేటా అప్‌లోడ్ వేగాన్ని నమోదు చేశాయి.

Related Posts