హిందూపురం
గత రెండు రోజులుగా కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు అనంతపురం జిల్లాలోని హిందూపురం ప్రాంతంలోకి కర్ణాటక నుంచి వస్తున్న నదుల ప్రవాహం పెరిగింది. హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు లేపాక్షి హిందూపూర్ చెరువులన్నీ నీటితో నిండి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది గత 20 సంవత్సరాలుగా ప్రవహించని పెన్నా, జయమంగళి, చిత్రావతి నదులు కర్ణాటకలో వర్షం రావడంతో భారీగా ప్రవహిస్తున్నాయి. హిందూపురం ప్రాంతాల్లోకి ప్రవహిస్తున్న పెన్నా ,జయమంగళి , చిత్రావతి నదులులతో నియోజవర్గం లోని అన్ని చెరువులతో పాటు ప పరిగి, కొట్నూరు శ్రీకంఠపురం చెరువుకలకు భారీగా నీరు చేరుతుంది. హిందూపురం లోని శ్రీకంఠపురం చెరువు నిండి రోడ్డుపై ప్రవహిస్తుండటంతో హిందూపూర్ లేపాక్షి వెళ్లే రహదారిపై రాకపోకలు అంతరాయం ఏర్పడింది నియోజకవర్గ వ్యాప్తంగా చాలా చోట్ల తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది