తిరుమల
తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయం, నారాయణగిరి వసతి సముదాయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోపలికి వర్షపు నీరు చేరింది. వర్షపు నీరును మోటార్ల సహాయంతో టిటిడి సిబ్బంది తొలగిస్తున్నారు. జపాలి ఆంజనేయస్వామి ఆలయంలోకి గతంలో ఎన్నడూ లేనివిధంగా వర్షపు నీరు చేరింది. తిరుమల కొండపై పలు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా పని చేయని సెల్ టవర్స్, దీంతో సర్వర్లు స్తంభించాయి. గురువారం కూడా సర్వర్లు పని చెయ్యక గదులు పొందేందుకు శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిన్న మధ్యాహ్నం భక్తులకు ఏటువంటి సమాచారం ఇవ్వకుండానే మొదటి ఘాట్ రోడ్డును మూసివేసారు. దీంతో తిరుమల నుండి తిరుపతికి వెళ్లే భక్తులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. ముందస్తుగా బుక్ చేసుకున్న రైల్వే, బస్సు రిజర్వేషన్ల సమయానికి తిరుపతికి చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టిటిడి నిర్ణయంపై పై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తపరిచారు. భక్తుల్లో నిరసన మొదలవడంతో తిరిగి రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మొదటి ఘాట్ రోడ్డులో తిరుపతి వెళ్లేందుకు భక్తులను అనుమతించారు.