అమరావతి
టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ భువనేశ్వరి ఇల్లు దాటి ఎప్పుడూ బయటికి రాలేదు. నా భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదు. నన్ను ప్రోత్సహించడం తప్ప భువనేశ్వరికి ఏమీ తెలియదు. ప్రతి సంక్షోభంలోనూ నాకు అండగా నిలిచారు. ప్రజల కోసం ఇంటికి రాకుండా ఎంతకాలం పనిచేసినా నా భార్య ప్రోత్సహించారని అన్నారు.
హుద్హుద్ తుఫాన్ సమయంలో విశాఖలో చాలా రోజులు ఉన్నా. ఈ ప్రభుత్వ వచ్చినప్పటి అవమానిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలను అవమానించడం పరిపాటిగా మారింది. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు నేను ఎవరినీ వ్యక్తిగతంగా అవమానించలేదు. నిండు కౌరవసభలో ఆనాడు ద్రౌపదికి అవమానం జరిగింది. ప్రజల ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా బాధ్యతగా భావించా. నా రాజకీయ జీవితంలో ఇంత బాధ ఎప్పుడూ భరించలేదు. బూతులు తిట్టినా, ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించాం. గతంలో వైఎస్ కూడా అసెంబ్లీలో నా తల్లిని అవమానించారు. ఆనాడు వైఎస్ తప్పు ఒప్పుకొని నాకు క్షమాపణ చెప్పారు. దేశం కోసం తప్పితే స్వార్థం కోసం ఆలోచించలేదు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు. ప్రజలపై భస్మాసుర హస్తం పెట్టింది సీఎం జగన్. స్పీకర్ - తమ్మినేని సీతారాం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను మాట్లాడుతుండగానే నా మైక్ కట్చేశారు. గతంలో తమ్మినేని టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారని గుర్తు చేసారు. గౌరవంగా బతికేవాళ్లను కూడా కించపరుస్తున్నారు. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి. నాకు పదవులు అవసరం లేదు. నా రికార్డులు బద్దలు కొట్టాలంటే చాలా సమయం పడుతుంది. ధర్మ పోరాటంలో ప్రజలు సహకరించాలి. క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్తా. అంతవరకూ అసెంబ్లీకి వెళ్లను. ఈ నిర్ణయాన్ని అసెంబ్లీలో చెప్పాలనుకున్నా. అసెంబ్లీలో మైక్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ చెబుతున్నా. ప్రజలు సహకరిస్తే రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు సహకరిస్తానని చంద్రబాబు అన్నారు.