హైదరాబాద్ నవంబర్ 19
ఇది దేశ రైతాంగ విజయం, ప్రజల విజయమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపద్యం లో శుక్రవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే విప్ బాల్క సుమన్,, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి,, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ,తదితరులతో కలిసి మాట్లాడారు.ఈ సందర్బంగావ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసువులు బాసిన రైతన్నలకు అశృనివాళులు అర్పించారు.చనిపోయెన వారి కుటుంబాలకు కేంద్రప్రభుత్వం క్షమాపణలు చెప్పి పరిహారం అందించాలని డిమాండ్ చేసారు.ఈ విషయంలో కేంద్రం ఆలస్యంగా నిర్ణయం తీసుకుంది .. అయినా సంతోషిస్తున్నామన్నారు.15 మాసాల పాటు చలికి వణుకుతూ, వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ, పోలీసుల లాఠీ దెబ్బలు తింటూ, బాష్పవాయువు గోళాలను భరిస్తూ , ఆకలికి అలమటించి, అమరులైన రైతుల వీరోచిత పోరాటానికి తెలంగాణ రైతాంగం తరపున తలవంచి నమస్కరిస్తున్నాం .. అసువులు బాసిన రైతాంగానికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నామన్నారు.నల్లచట్టాలు గొప్పవని ప్రచారం చేసిన అపర స్వయం ప్రకటిత మేధావులు జాతికి క్షమాపణ చెప్పాలి .. తమ అవివేకపు వాదనపు తప్పుదారి పట్టించినందుకు సిగ్గుపడాలన్నారు.నల్లచట్టాల గురించి రైతులకు కూలంకషంగా అర్దమయిందని భావించే కేంద్రం వెనక్కు తగ్గిందన్నారు.గత కొన్నాళ్లుగా తెలంగాణ ధాన్యం కొనుగోలు కోసం జరుగుతున్న పరిణామాలు , కేసీఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్లడం, లేఖలు, వాదోపవాదాలు, తెలంగాణ బీజేపీ అసంబద్ధ వైఖరి వెరసి తెలంగాణ ప్రభుత్వం ఆందోళన పథం పట్టే అగత్యం కలిగిందని,ఉత్తరాది రైతు ఆందోళనలు దక్షిణాదికి విస్తరిస్తే దానికి కేసీఆర్ నాయకత్వం వహిస్తే కేంద్ర ప్రభుత్వ ఉనికికి ముప్పు అని భావించినట్లు మాకు అర్ధమవుతుంది .. నిన్న కేసీఆర్ ధర్నాలో ఆ దిశగా సంకేతాలు పంపించారని,నిన్న ఆందోళనకు దిగడం కూడా కేంద్రంలో చలనానికి ఒక కారణ మన్నారు.ఈర్శ, ద్వేషాలతో ఇక్కడి బీజేపీ నేతలకు కేసీఆర్ ప్రజ్ఞాపాటవాలు ఒప్పుకోకున్నా మోడీకి కేసీఆర్ గారి గురించి తెలుసు ఏడేండ్ల తెలంగాణ ప్రభుత్వ విజయాలు కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి తెలుసునన్నారు.అన్ని భాషల మీద పట్టున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తే ఏం జరుగుతుందో మోడీ ప్రభుత్వానికి తెలుసుఇద్దరు ఎంపీలతో దేశంలోని 36 రాజకీయ పార్టీలను ఒప్పించి కేసీఆర్ తెలంగాణ సాధించిన తీరు కూడా బీజేపీ నాయకత్వానికి తెలుసువ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ వల్ల తప్పు జరిగిందని దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధాని అయిన మోడీ తమ ప్రభుత్వం వల్ల జరిగిన తప్పిదానికి హుందాగా క్షమాపణ చెప్పడం అభినందనీయ మన్నారు.మోడీకి ఉన్న సంస్కారం, హుందాతనంలో కొంచెమైనా తెలంగాణ బీజేపీ నేతలకు ఉంటే బాగుండేదన్నారు.మోడీ తప్పును అంగీకరించినా ఇప్పటికి కొందరు బీజేపీ నేతలు చట్టాలు కొందరికి అర్దం కాలేదని అంటుండడం అవివేకమన్నారు.వ్యవసాయ చట్టాలకు ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీనే .. దాని పెంచి అమలుకు యత్నించింది మోడీ ప్రభుత్వ మన్నారు.ఈ నల్లచట్టాలను 2019 తమ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొందని,కాంగ్రెస్ పార్టీ కొంచెమైనా సిగ్గుపడాలి .. దేశ రైతాంగం ఏడాదికి పైగా చేసిన పోరాటంలో వీరి పాత్ర లేదన్నారు.ఎన్ని జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేసే పరిస్థితి కనిపించడం లేదు .. ఇప్పుడు దాని గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం విడ్డూరమన్నారు.మోడీ ప్రభుత్వమే వేసిన శాంతకుమార్ కమిటీ 2015లో ఇచ్చిన నివేదిక సూచనలను కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేసారు.ఎఫ్ సీ ఐ ఎగుమతులు చేయాలని, ఆహార నిల్వలు పేరుకుపోయాయన్న పేరుతో సేకరణ అపొద్దని చెబితే కేంద్రం ఎందుకు నిర్లక్ష్యం చేసిందని ప్రశ్నించారు.ఈ దేశంలో ఇప్పటికీ ఆకలి కేకలు వినిపిస్తున్నాయని దేశ న్యాయమూర్తి చెప్పారని,హ్యూమన్ ఇండెక్స్ లో భారత్ 101 స్థానంలో ఉందని నిన్న కేసీఆర్ చెప్పారు ..దేశంలో 22 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు .. కరోనా విపత్తు సమయంలో ఆరు కిలోలకు బదులు పది కిలోలు ఇస్తే ఈ నిల్వలు తగ్గేవి కదా అని అన్నారు.దేశంలో కోట్లాది మందికి ఉపాధి కల్పించే వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమన్నారు.కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేశాయనన్నారు.ఇప్పటికైనా దేశంలోని సాగుభూమిని గుర్తించి పంటకాలనీలుగా విభజించి సమగ్ర వ్యవసాయ విధానంతో ముందుకుపోవాలన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత కొన్నేళ్లుగా కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు.కార్పోరేట్లకు రూ.6 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేసిన కేంద్రం ఈ దేశ రైతాంగం కోసం వ్యవసాయరంగాన్ని పటిష్టం చేసేందుకు నిధులు కేటాయించే బాధ్యత లేదా అని ప్రశ్నించారు.వ్యవసాయరంగంలో సమూల మార్పులు తెచ్చి ఈ దేశ యువతను ఈ రంగం వైపు వ్యవసాయం వైపు మళ్లించాలన్నారు.తెలంగాణ వరిని కేంద్రం కొనుగోలు చేయాలి .. తెలంగాణలో వరి సాగును కేంద్రం ప్రోత్సహించాలి .. కాపాడాలి .. సేకరించాలన్నారు.కొనుగోళ్లు బాధ్యత కేంద్రానిదే .. ఈ డిమాండ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గదు .. ప్రధాని మోడీ స్వయంగా ఈ విషయంలో జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలి.వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవడం కేసీఆర్ విజయం, మహాధర్నా విజయమన్నారు.వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, పంపిణీ భారత ప్రభుత్వ విధి .. రాజ్యాంగమే దీనిని తేల్చిచెప్పిందని,దేశంలో వ్యవసాయ స్థిరీకరణకు ప్రధాని స్థాయిలో ఇప్పటికైనా ఒక చర్చ పెట్టాలి .. పంటల సాగు, జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ మీద పరిశీలన చేసి రైతాంగానికి దిశానిర్దేశం చేసి సమగ్ర వ్యవసాయ విధానం అమలు చేయాలని డిమాండ్ చేసారు.