YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పేదల ఇళ్ల నిర్మాణం వేగవంతం : పల్లే

పేదల ఇళ్ల నిర్మాణం వేగవంతం : పల్లే

ఎన్టీఆర్ గృహాల మంజూరు అర్హులైన పేదలకు చేరాలి. పేదలకు పారదర్శకంగా ఎన్టీఆర్ గృహాలు కేటాయిస్తాం. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళండని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం నాడు పుట్టపర్తి నియోజకవర్గం లోని ఆరు మండలాల హౌసింగ్ ఈ ఈ ,ఏఈ లతో  అనంతపురం లోని ప్రభుత్వ చీఫ్ విప్ నివాసంలో నిర్వహించిన నియోజకవర్గ ఎన్టీఆర్ గృహ నిర్మాణ ప్రగతి పై అయన సమీక్ష నిర్వహించారు. భేటీలో అయన మాట్లాడుతూ ఎన్టీఆర్ గృహాల్లో అవినీతి కి ఆస్కారం లేదు...అవినీతికి పాల్పడితే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్టీఆర్ గృహాల్లో కొంత మంది లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని. ఇవి పురావృతం అయితే సహించేదిలేదని హెచ్చరించారు. గృహనిర్మాణ బిల్లులు లబ్దిదారులకు త్వరగా అందేలా చూడాలని, లేకుంటే ప్రభుత్వానికి బాగా చెడ్డపేరువస్తుందని అధికారులను హెచ్చరించారు. గ్రామాల్లో లబ్దిదారులకు గృహ నిర్మాణం లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, సత్వర్యమే గృహనిర్మాణం పూర్తి చేసిన వారికి బిల్లులు వెంటనే వారి ఖాతాలో పడేలా చూడాల్సిన బాధ్యత అధికారుల పై ఉందన్నారు. వివిధ దశల్లో గృహాలు మంజూరైన వాటిలో నిర్మాణంలో ఉండి కొంత మంది లబ్దిదారులకు బిల్లులు ఆలస్యం కావడానికి బ్యాంక్ కు గృహానిర్మాణానికి ,ఎన్ పి సి కి ఆధార్ అనుసంధానం  కాకపోవడం వల్ల బిల్లులు ఆలస్యం అవుతోందని అధికారులు చీఫ్ విప్ పల్లె దృష్టికి తీసుకువచ్చారు. బిల్లులు పడని లబ్దిదారులకు అవగాహన కల్పించి ఆధార్ ను అనుసంధానం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ ఈఈ చంద్రమౌళిరెడ్డి, మండల ఏఈ లు హరిప్రసాద్ రెడ్డి, తేజేశ్వరి, రాజేష్, సంపత్ ,రాజశేఖర్, మల్లిఖార్జున ,చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.

Related Posts