కామారెడ్డి
కామారెడ్డి జిల్లా లో ప పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. కళ్ళంలోకి కాంగ్రెస్ నినాదం తో కామారెడ్డి జిల్లా లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. జిల్లా లో ఇటీవల భారీ వర్షానికి ధాన్యం తడిచింది. తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనకి దిగారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న రేవంత్ పర్యటన లో గోడు వెళ్లబోసుకున్నారు రైతులు. .టీఆరెస్ బీజేపీ డ్రామా కంపెనీ తీరుగా డ్రామాలు అడుతిన్నాయని రేవంత్ మండిపడ్డారు. తడిచిన ధాన్యం త్వరగా కొనాలని..రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రేవంత్ మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్నినిలదీస్తాం. పోలీసులు కేసీఆర్ ను కాపడలేరు. ఎడ్లబండికి కట్టి ఈడ్చుకు వెళతాం. మోడీ కేసీఆర్ లు రైతు ద్రోహులు. ఇద్దర్ని ఉరి వేసే రోజులు దగ్గర పడ్డాయి. రైతులతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు బాగుపడలేదు. రైతుల పోరాటం తోనే నల్ల చట్టాలపై వెనక్కి తగ్గారు. రైతులు పోరాడాలి భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని అన్నారు.