YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భారీ వర్షాలపై సీఎం సమీక్ష

భారీ వర్షాలపై సీఎం సమీక్ష

అమరావతి
ఏపీలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో.. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. చెన్నైకి సమీపంలో వాయుగండం తీరాన్ని తాకే అవకాశముంది. దీంతో 2021, నవంబర్ 19వ తేదీ శుక్రవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో సీఎం జగన్ ఐదు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. ఈ సందర్భంగా మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. 1. నెల్లూరుకు సీనియర్ అధికారి రాజశేఖర్. 2. చిత్తూరుకు ప్రద్యుమ్నా. 3. కడపకు సీనియర్ అధికారి శశిభూషణ్ లను నియమించారు.

Related Posts