న్యూఢిల్లీ నవంబర్ 19, కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న కేంద్రం
*దేశంలోని రైతులందరికీ క్షమాపణలు చెప్పిన ప్రధాని మోడీ
*ఆందోళన విరమించి ఏళ్లకు వెళ్ళండి
*తాను ఏది చేసినా.. అది రైతుల కోసమే చేశా
*ఫసల్ బీమా యోజనను బలోపేతం చేశా
*ఏది చేసినా అది దేశం కోసమే..మీ దీవనలతో నా కృషినంతా మీకు ధారపోస్తా
అన్నదాతలు విజయం సాధించారు. ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించింది. ఇవాళ జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయాల్లోనూ వెనక్కి తగ్గని మోదీ సర్కార్.. అన్నదాతల ఆగ్రహానికి తలొగ్గింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. నూతన సాగు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో కిసాన్ ఉద్యమాలు హోరెత్తించాయి. ముఖ్యంగా ఇవాళ పంజాబ్, హర్యానా రైతులు ప్రధాని ప్రకటనతో ఇక ఆనందంలో తేలారు. సీఎం కేసీఆర్ నేపథ్యంలోనూ తెలంగాణ సర్కార్ కూడా రైతు చట్టాలకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే.గురుపూరబ్ సందర్భంగా ప్రధాని మోదీ ఇవాళ ఉదయమే కీలక ప్రకటన చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రైతు చట్టాల రద్దుపై తీర్మానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దేవ్ దీపావళి, ప్రకాశ్ పర్వ్ సందర్భంగా గ్రీటింగ్స్ చెబుతున్నట్లు మోదీ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. కార్తార్‌పూర్ కారిడార్‌ను ఒకటిన్నర ఏళ్ల తర్వాత రీఓపెన్ చేయడం సంతోషకరమని ఆయన అన్నారు. గురునానక్ దేశ సేవ బోధనలను ఆయన గుర్తు చేశారు. 2014లో తాను ప్రధాని అయిన తర్వాత రైతులకు ప్రాముఖ్‌నత కల్పించానని, వారి సంక్షేమం.. అభివృద్ధి కోసం పని చూశామన్నారు.100 మంది రైతుల్లో.. 80 మంది రైతుల వద్ద రెండు ఎకరాల లోపే భూమి ఉందన్నారు. ఆ భూమే వారికి జీవనాధారంగా మారిందన్నారు. రైతులు తమ కష్టానికి తగ్గ ఫలితం పొందేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. గ్రామీణ మౌళిక సదుపాయాల మార్కెట్‌ను బలోపేతం చేశామన్నారు. ఎంఎస్‌పీ పెంచామన్నారు. రికార్డు స్థాయిలో ప్రొక్యూర్‌మెంట్ సెంటర్లను పెంచామన్నారు. తాము చేపట్టిన ప్రొక్యూర్మెంట్ విధానం గత ప్రభుత్వ రికార్డులను బ్రేక్ చేసిందని ప్రధాని మోదీ తెలిపారు.రైతులకు సరసమైన ధరల్లో విత్తనాలను సరఫరా చేశామని ప్రధాని వెల్లడించారు. 22 కోట్ల భూసార హెల్త్ కార్డులను జారీ చేశామన్నారు. ఇలాంటి విధానాల వల్ల సాగు దిగుబడి పెరిగిందన్నారు. ఫసల్ బీమా యోజనను బలోపేతం చేశామన్నారు. ఆ స్కీమ్ కిందకు అధిక సంఖ్‌ులో రైతుల్ని చేర్చామన్నారు. కొత్తగా తెచ్చిన మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని, నెల రోజుల్లో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని ప్రధాని తెలిపారు.ధర్నాలు చేస్తున్న రైతులంతా తమ ఇండ్లకు వెళ్లిపోవాలని ప్రధాని కోరారు. తాను ఏది చేసినా.. అది రైతుల కోసమే చేశానన్నారు. ఏది చేసినా.. అది దేశం కోసమే చేశానన్నారు. మీ దీవనలతో.. నా కృషినంతా మీకు ధారపోస్తానన్నారు. రైతు బాగు కోసం మరింత కఠినంగా పనిచేస్తానని మోదీ అన్నారు. మీ స్వప్నాలను, దేశ స్వప్నాలను నిజం చేసేందుకు పనిచేస్తానని ప్రధాని తెలిపారు.రైతులు ఆందోళన విరమించాలని, ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని, దేశంలోని రైతులందరికీ క్షమాపణలు చెబుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.