YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైఎస్ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు - జగన్ ఆవేదన.... క్యారెక్టర్ అసానినేషన్ చేస్తున్నారు - చంద్రబాబు ఆవేదన...

వైఎస్ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు - జగన్ ఆవేదన....   క్యారెక్టర్ అసానినేషన్ చేస్తున్నారు - చంద్రబాబు ఆవేదన...

వైఎస్ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు-  జగన్ ఆవేదన

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. చంద్రబాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి.. మళ్లీ సీఎం అయిన తరువాతనే అసెంబ్లీకి వస్తానని శపథం చేసి బయటకు వెళ్లిపోయారు. అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారుచంద్రబాబు నాయుడు ఫ్రస్టేషన్‌లో ఉన్నారని అందరికీ తెలిసిన విషయం సీఎం జగన్ అన్నారు. 'ప్రజలు ఆయన మీద వ్యతిరేకతను బాహాటంగా చూపించటం.. కుప్పం నియోజకర్గంలో ఊహించని రీతిలో ఓడిపోవడం.. కౌన్సిల్‌లో వారికున్న బలం తగ్గిపోవడం.. కౌన్సిల్‌లో వైఎస్సార్సీసీపీ బలం పెరగడం.. దళితుడు మండలికి చైర్మన్ కావడం.. ఇవన్నీ కూడా తట్టుకోలేక చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఏం మాట్లాడుతున్నాడో.. ఏం చేస్తున్నాడో.. తనకే అర్థం కాని పరిస్థితిలో ఆయన వ్యవహరించారని' జగన్ అన్నారు.ఒకే అబద్దాన్ని పదేపదే చెబుతూ.. అదే నిజమని నమ్మించేలా పచ్చ మీడియా ప్రచారం చేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. అయితే నిజం మాత్రం మార్చలేరని అన్నారు. కళ్లలో నీళ్లు తిరక్కపోయినా తిరిగినట్లు డ్రామాలు చేయడం.. చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నట్లు పచ్చ మీడియా ప్రచారం చేయడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజల అండ ఉన్నంత వరకు విజయం మాత్రం న్యాయానిదే అన్నారు.'మా చిన్నాన్న గురించి మాట్లాడుతున్నారు. ఎవరు అధ్యక్షా ఆయన.. సొంతం మా నాన్న తమ్ముడు.. చంద్రబాబు నాయుడికి కాదు.. అవినాష్ మీద నిందలు వేస్తున్నారు. ఎందుకు చేస్తారు..? ఒక కన్ను ఇంకో కన్ను ఎందుకు పొడుచుకుంటుంది..?' అని సీఎం జగన్ ప్రశ్నించారు.  చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎవరూ సభలో మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయనే తన చిన్నాన్న, చెల్లి గురించి మాట్లాడారన్నారు. గతంలో జరిగిన హత్యలపై విచారణ జరగాలని తమ సభ్యులు అంటే దాన్ని మరో రకంగా మార్చి డ్రామా క్రియేట్‌ చేశారని విమర్శించారు సీఎం జగన్. గతంలో తన చిన్నాన్నను ఓడించారని, ఆయన్ను వాళ్లే ఏదో ఒకటి చేసి ఉంటారని వ్యాఖ్యానించారు సీఎం జగన్‌. చంద్రబాబు మాటలు చూస్తే ఒక్కోసారి బాధ అనిపిస్తుందన్నారు. ఆ సమయంలో తాను సభలో లేనని అన్నారు సీఎం జగన్. తాను సభకు రాకముందు కలెక్టర్లతో వర్షాలపై సమీక్షచేసినట్లుగా తెలిపారు. సభకు వచ్చిన తర్వాత జరిగిన పరాణామాలేంటో తెలుసుకున్నాను. సభలోకి వచ్చేసరికి చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నారు. చంద్రబాబు మీద తాము వ్యతిరేకంగా ఉన్నామని తీర్పిచ్చారు.ఊహించని విధంగా ప్రజల వ్యతిరేకత చూశారు. మండలిలో కూడా వారికున్న బలం పూర్తిగా మారిపోయింది. మండలిలో కూడా వైయస్సార్‌సీపీ బలం గణనీయంగా పెరిగింది.రైతులకు సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు..  ఒకవైపున వర్షాల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్న సందర్భాల్లో .. ప్రతిపక్షం వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వాలి కానీ అలా జరగడం లేదని సీఎం అన్నారు. పలానా మాదిరిగా చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పొచ్చు. అలాంటి పరిస్థితిని పూర్తిగా పక్కనపెట్టేసి, ప్రజలు ఎలా ఉన్నా పర్వాలేదు, ప్రజలు ఎలా ఉన్నా అభ్యంతరం లేదు నా ఎజెండా రాజకీయ అజెండానే  ప్రతి అంశంలోనూ.. నాకు రాజకీయ లబ్ధి జరగాలి, లబ్ధి చేకూర్చుకునేలా ప్రవర్తిస్తాను అనే ధోరణిలోకి చంద్రబాబు  వెళ్లిపోతారని విమర్శించారు సీఎం జగన్.ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడే ఇవన్నీ జరిగాయని.. మా చిన్నాన్నను ఎవరైనా ఏదైనా చేశారంటే అది వాళ్లే చేసి ఉంటారని అన్నారు. అటు ఇటు చేసి మభ్య పెడుతూ.. తమ కుటుంబంలోని చిచ్చు పెడుతున్నారని జగన్ మండిపడ్డారు.

క్యారెక్టర్ అసానినేషన్ చేస్తున్నారు చంద్రబాబు ఆవేదన

ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. ప్రెస్‌మీట్‌లోనే వెక్కి, వెక్కి ఏడ్చారు.. పక్కనే ఉన్న టీడీపీ నేతలు ఓదార్చారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల్ని అవమానిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య భువనేశ్వరి ఇల్లు దాటి ఎప్పుడూ బయటకు రాలేదన్నారు. క్యారెక్టర్ అసానినేషన్ చేస్తున్నారని.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదన్నారు.రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎంతో ఓర్పుగా ఉన్నానన్నారు చంద్రబాబు. తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిణామాలు చూడలేదని.. ఇంత బాధ భరించలేదన్నారు. బూతులు తిట్టినా.. ఎన్ని అవమానాలకు గురి చేసినా భరించానన్నారు. అధికారంలో తాను ఎవర్నీ కించపరచలేదని.. నిండు గౌరవ సభలో ఆనాడు ద్రౌపదికి అవమానం జరిగిందని.. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా బాధ్యతగా భావించాను అన్నారు. ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అసెంబ్లీలో తన తల్లిని అవమానించారని.. తర్వాత తప్పు జరిగిందని క్షమాపణ కోరారన్నారు. ప్రజా క్షేత్రంలోనే పోరాడతానని.. తన ధర్మ పోరాటానికి ప్రజలు సహకరించాలన్నారు. మళ్లీ ప్రజల మద్దతుతో మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానన్నారు.

Related Posts