గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ లు కీలకపాత్ర పోషించాలి. పార్టీలకతీతంగా గ్రామాల్లో మౌళిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి పరిటాల సునీత అన్నారు. బుధవారం నాడు అనంతపురం జెడ్పీ సమావేశ మందిరంలో పంచాయితీరాజ్ దినోత్సవంలో ఆమె పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 534 కి.మీ సి.సి రోడ్లు నిర్మించాం. రాప్తాడు నియోజకవర్గంలో 100 కి.మీ సి.సి రోడ్లు నిర్మించాం. పార్టీలకతీతంగా గ్రామాల్లో మౌళిక వసతులు కల్పిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీల్లో ఎల్ ఈ డీ బల్బులు ఏర్పాటు చేశాం. గ్రామాల అభివృద్ధి సి.ఎం చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమన్నారు. రాష్ట్రం విడిపోయి ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా గతంలో ఎన్నడూ చేయని అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు చేస్తున్నారని మంత్రి అన్నారు.