YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్ర‌బాబు ఏడుపుతో నాకు ఇవాళ హ్యాపీగా ఉంది అంద‌రి ఉసురు త‌గిలి బాబు ఇవాళ ఇలా అయిపోయావు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబు ఏడుపుతో నాకు ఇవాళ హ్యాపీగా ఉంది   అంద‌రి ఉసురు త‌గిలి బాబు ఇవాళ ఇలా అయిపోయావు    వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అమ‌రావ‌తి
టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు ఏడుపుతో తాను ఇవాళ హ్యాపీగా ఉన్నాన‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. అంద‌రి ఉసురు త‌గిలి బాబు ఇవాళ ఇలా అయిపోయావు అని రోజా వ్యాఖ్యానించారు.ఏపీ అసెంబ్లీ వాయిదా ప‌డిన అనంత‌రం ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. విధి ఎవ‌ర్నీ విడిచిపెట్ట‌దు చంద్ర‌బాబు. అంద‌రి స‌ర‌దా తీర్చేస్తోంది. 72 సంవ‌త్స‌రాల వ‌య‌సులో ఎన్టీఆర్‌ను ఎంత ఏడిపించావో గుర్తుందా ? 71 సంవ‌త్స‌రం 7 నెల‌ల‌కే నీవు ఏడ్చే ప‌రిస్థితి వ‌చ్చింది. అందుకే అంటారు.. మ‌నం ఏది చేస్తే.. అది మ‌న‌కు తిరిగి వ‌స్తుంద‌ని. ఏదో నీ భార్య‌ను అనేశారు.. చాలా బాధ‌ప‌డిపోతున్నావే. మ‌రి ఆరోజు హైద‌రాబాద్ అసెంబ్లీలో నువ్వు అధికారంలో ఉన్న‌ప్పుడు రోజా బ్లూ ఫిల్మ్‌లో యాక్ట్ చేసింద‌ని పీత‌ల సుజాత‌తో మీడియా పాయింట్ వ‌ద్ద సీడీలు చూపించిన విష‌యం మ‌రిచిపోయావా? అంటే నాకొక ఫ్యామిలీ లేదు. మాకు పిల్ల‌లు లేరు. మాకు గౌర‌వం లేదా? ఎవ‌ర్ని ఏదైనా అంటావు.. నీ అధికారంలో ఉన్న‌ప్పుడు. ఇదే విజ‌య‌మ్మ‌ను ఎంత ఏడిపించావు. భార‌త‌మ్మ గురించి ఎన్ని మాట్లాడావు. ష‌ర్మిల‌మ్మ‌ను ఏ విధంగా హ్యుమిలేట్ చేశావు.. ఎవ‌రూ మ‌రిచిపోలేదు. కాబ‌ట్టి ఈరోజు ఎవ‌రో ఏదో అన్నార‌ని దొంగ ఏడుపులు ఏడ్చే నిన్ను ఎవ‌రూ జాలితో కూడా చూడ‌రు.అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌ధాని మోదీతో స‌హా ఎవ‌ర్నీ వ‌దిలిపెట్ట‌కుండా అధికారంలో ఉన్న‌ప్పుడు ఎన్ని మాట్లాడావు. నీ సోష‌ల్ మీడియాలో ఎన్ని స్ప్రెడ్ చేశావు అనేది అంద‌రికీ గుర్తు ఉంది. కాబ‌ట్టి చంద్ర‌బాబు నాయుడు నేను ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఒక మ‌హిళ అని చూడ‌కుండా, నీ కోసం 10 సంవ‌త్స‌రాలు ప‌ని చేసిన లీడ‌ర్‌గా చూడ‌కుండా న‌న్ను ఎన్నో ర‌కాలుగా వేధించి అవ‌మానించావు. న‌న్ను మాన‌సిక క్షోభ‌కు గురి చేశావు. నీవు ఏడిపించిన ప్ర‌తి ఒక్క‌రి ఏడుపు నీకు త‌గిలింది. అంద‌రి ఉసురు త‌గిలి నీవు ఇవాళ ఇలా అయిపోయావు. న‌న్నైతే రూల్స్ కు విరుద్ధంగా వ‌న్ ఇయ‌ర్ స‌స్పెండ్ చేశావు. ఇక నిన్ను అయితే రెండున్న‌ర సంవ‌త్స‌రాలు కాదు క‌దా.. జీవితంలోనే అసెంబ్లీలో అడుగుపెట్ట‌ని విధంగా నీకు నీవే శ‌ప‌థం చేసుకున్నావ్ అని రోజా వ్యాఖ్యానించారు.

Related Posts