YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీకి పెరిగిన ఓటు షేర్

టీడీపీకి పెరిగిన ఓటు షేర్

విజయవాడ, నవంబర్ 20,
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకుంది. అయితే ఫలితాలను పూర్తి స్థాయిలో విశ్లేషిస్తే మాత్రం మినీ లోకల్ వార్ లో వైసీపీ గెలిచినా.. టీడీపీకి ఊరట దక్కిందనే అంచనాలే వస్తున్నాయి. బుధవారం వచ్చిన ఫలితాల్లో తెలుగు దేశం పార్టీకి గతంలో పోలిస్తే మెరుగైన ఫలితాలు వచ్చాయి. 2021 మార్చిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో పోల్చితే.. టీడీపీ భారీగా పుంజుకుంది. అధికార వైసీపీ మాత్రం పెద్ద శాతంలో ఓట్లను కోల్పోయింది. తాజా ఫలితాల్లో  తెలుగుదేశానికి ఓట్లు శాతం పెరిగాయి. దొంగ ఓట్లు, దొంగ నోట్లు, దౌర్జన్యాలకు దిగినా టీడీపీ మంచి ఫలితాలు సాధించింది.దీంతో జగన్ పార్టీకి పతనం మొదలైందనే చర్చ సాగుతోంది. మినీ లోకల్ వార్ లో ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తెలుగుదేశం గట్టి పోటీ ఇచ్చింది. 2021 మార్చిలో 12 నగరపాలికలు, 75 పురపాలికలు, నగర పంచాయతీలలో 2,164 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో  వైసీపీకి 52.63 శాతం ఓట్లు, 82.60 శాతం సీట్లు వైసీపీ చేజిక్కించుకుంది. 2021 నవంబరులో అంటే 6 నెలల వ్యవధిలో జరిగిన ఒక నగరపాలిక, 12 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఓట్ల శాతం 30.13 శాతం నుంచి సుమారు 44 నికి పెరిగింది . అంటే 6 నెలల్లోనే 14 శాతం ఓట్లు టీడీపీకి పెరిగాయి. అలాగే సీట్ల సంఖ్య 12.72 శాతం  నుంచి 25 శాతానికి దాదాపు 13 శాతం పెంచుకుంది తెలుగు దేశం పార్టీ. 12 మున్సిపాలిటీలకుగాను 7 మున్సిపాలిటీలలో టీడీపీ నువ్వా నేనా అన్న స్థాయిలో పోటీ ఇచ్చింది. దర్శి నగర పంచాయతీని కైవసం చేసుకోగా.. కొండపల్లి, జగ్గయ్యపేట మున్సిపాలిటీల్లో మెజార్జీ సీట్లు సాధించింది. గుంటూరు కార్పొరేషన్ లో జరిగిన ఒక డివిజన్ ఉప ఎన్నికలో టీడీపీ జయకేతనం ఎగురవేసింది. 6 నెలల వ్యవధిలోనే ఇంత భారీ స్థాయిలో తెలుగుదేశం సీట్లు, ఓట్లు పెరగడం వైసీపీకి పెద్ద దెబ్బే అంటున్నారు. ఇది వైసీపీపై వేగంగా పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తమపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని గ్రహించిన వైసీపీ.. కుప్పం ఫలితాన్ని హైలెట్ చేసి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. కుప్పం పోలింగ్ లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలకు తెలుసంటున్నారు. కుప్పంలో దొంగ ఓట్లతోనే వైసీపీ గెలిచిందని అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఫలితాలు తెలుగు దేశం పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చాయంటున్నారు తమ్ముళ్లు, చంద్రబాబు నాయకత్వానికి ఓటర్లలో ఆదరణ పెరిగిందని చెబుతున్నారు. మరోవైపు మినీ లోకల్ వార్ ఫలితాలపై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. సహజనంగా ఏ ప్రభుత్వానికైనా చివరి సంవత్సరంలో వ్యతిరేకత వస్తుంది.. కానీ జగన్ రెడ్డి  ప్రభుత్వానికి మాత్రం రెండున్నరేళ్లలోనే భారీ స్థాయి వ్యతిరేకత కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని జనాలు నమ్ముతున్నారనే సంకేతం ఫలితాల ద్వారా వచ్చిందంటున్నారు. ఆయన వస్తేనే ఆంధ్రా నిలబడుతుందనే చర్చ జనాల్లో రోజురోజుకు పెరిగిపోతుందని రాజకీయ అనలిస్టులు చెబుతున్నారు, మొత్తంగా మినీ లోకల్ వార్ ఫలితాలు టీడీపీలో జోష్ నింపుతుండగా.. అధికార వైసీపీలో మాత్రం కలవరం రేపుతుందనే చర్చ అన్ని వర్గాల్లో సాగుతోంది.

Related Posts