YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అప్పుడు జగన్.. ఇప్పుడు బాబు స్పీకర్ వైపే అన్ని వేళ్లు

అప్పుడు జగన్.. ఇప్పుడు బాబు స్పీకర్ వైపే అన్ని వేళ్లు

విజయవాడ, నవంబర్ 20,
ఏపీ అసెంబ్లీలో గత కొన్నేళ్లుగా మారుతున్న పరిస్ధితులు రాజకీయ నేతల్ని ఇరుకునపడేస్తున్నాయి. అధికారంలో ఉండగా ప్రతిపక్షాల్ని పూర్తిగా తొక్కేయాలన్న ప్రభుత్వాధినేతల ధోరణితో విపక్ష నేతలు విసిగిపోతున్నారు. గతంలో టీడీపీ అధికారంలోకి ఉండగా.. విపక్ష నేత జగన్ అసెంబ్లీని బాయ్ కాట్ చేసి వెళ్పిపోగా.. ఇప్పుడు విపక్ష నేత చంద్రబాబు కూడా అదే కారణంతో అసెంబ్లీని బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. దీంతో చంద్రబాబు, జగన్ నిర్ణయాలపై చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో పరిణామాలు గత పదేళ్లలో ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు సాధారణ ప్రజలకు వెగటు పుట్టిస్తున్నాయి. అధికార, విపక్షాల మధ్య సాగుతున్న రాజకీయ యుద్ధం పరాకాష్టకు చేరుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే బూతులతో విమర్శలు, ప్రతివిమర్శలతో చట్టసభలు అభాసుపాలవుతున్నాయి. అంతటితో ఆగకుండా ఏకంగా చట్టసభల్లోనే ప్రత్యర్ధుల్ని అణచివేయాలన్న దృక్ఫథంతో అధికార పార్టీలు వేస్తున్న అడుగులు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఎవరు అధికారంలో ఉన్నా ప్రత్యర్ధుల్ని అణగదొక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలు విమర్శల పాలవుతున్నాయి. ఇదే క్రమంలో విపక్షాల్లో ఉంటున్న ప్రత్యర్ధి పార్టీల నేతలు తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. చంద్రబాబు అసెంబ్లీ బాయ్ కాట్ తాజాగా ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలతో విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాను అధికారంలోకి వచ్చేవరకూ సభలో తిరిగి అడుగుపెట్టరాదని నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకూ సభలో అడుగుపెట్టేది లేదని ఇవాళ శపథం చేసి మరీ వెళ్లిపోయారు. కుప్పంలో తాజాగా టీడీపీ ఓటమిపాలవ్వడంతో వైసీపీ నేతలు ఆ విషయాన్ని అడ్డుపెట్టుకుని తీవ్ర విమర్శలకు దిగడం, స్పీకర్ తమ్మినేని కూడా మైక్ ఇవ్వకుండా అడ్డుకోవడంతో చంద్రబాబు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. చివరకు హేరిటేజ్ ను టార్గెట్ చేసే క్రమంలో భార్య భువనేశ్వరి ప్రస్తావన కూడా తీసుకొచ్చి బూతులు తిట్టడంతో చంద్రబాబు చేసేది లేక అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకున్నారు. బ్రోకర్లకు శుభాకాంక్షలు: రైతులకు మేలు చేసే చట్టాలు వెనక్కి అంటూ రాజాసింగ్ సంచలనం జగన్ అసెంబ్లీ బాయ్ కాట్ గతంలో 2017 అక్టోబర్ 25న అప్పటి విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం జగన్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో జగన్ పై ఓ పిచ్చోడిగా ముద్ర వేసేందుకు ప్రయత్నించడం, మైక్ ఇవ్వకుండా అడ్డుకోవడం, వైసీపీ వాదన బయటికి రాకుండా అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ అడ్డుపడటం, వైసీపీ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ బహిష్కరణ అస్త్రాలు సంధించడంతో చేసేది లేక వైసీపీ అధినేత కమ్ విపక్ష నేతగా ఉన్న జగన్ కూడా అసెంబ్లీని బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. ఇలాంటి సభకు రాదలచుకోలేదంటూ అప్పట్లో జగన్ బాయ్ కాట్ చేసేశారు. తిరిగి తాను అధికారంలోకి వచ్చే వరకూ ఆయన సభకు రాలేదు. అప్పట్లో వైఎస్ జగన్ అసెంబ్లీని బాయ్ కాట్ చేసి వెళ్లిపోగా.. ఇప్పుడు చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించి వెళ్లిపోయారు. అయితే జగన్, చంద్రబాబు ఇద్దరు అసెంబ్లీని బాయ్ కాట్ చేసి వెళ్లడం వెనుక కూడా స్పీకర్ నిర్ణయాలు, వారి పాత్రే కీలకంగా మారింది. అప్పట్లో స్పీకర్ కోడెల తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ జగన్ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోగా.. ఇఫ్పుడు చంద్రబాబు కూడా అధికార వైసీపీ తన భార్యపై విమర్శలు చేస్తున్నా తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్ కట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇద్దరు నేతలు దాదాపు అదే కారణంతో అసెంబ్లీకి దూరం కావడం చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో సభలో అధికార, విపక్షాల్ని సమానంగా చూడాల్సిన స్పీకర్ల పాత్ర కూడా తెరపైకి వస్తోంది.

Related Posts