YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కమలం ఆపరేషన్ స్టార్ట్

కమలం ఆపరేషన్ స్టార్ట్

గుంటూరు, నవంబర్ 20,
ఆంధ్రప్రదేశ్ బీజేపీలోకి నేతల్ని ఆకర్షించాలని దిశానిర్దేశం చేసి వెళ్లడంతో .. ఆ పార్టీకి చెందిన నేతలు ఇప్పుడు పని ప్రారంభించారు. ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహించేందుకు ప్రత్యేకమైన టీంను నియమించుకుంటున్నారు. ఆ టీం ద్వారా ఎవరెవర్ని బీజేపీలోకి తీసుకు రావాలో ఓ లిస్ట్ రెడీ చేసుకుని రంగంలోకి దిగిపోతారని తెలుస్తోంది. అయితే ఏ పార్టీ నుంచి నేతల్ని ఆకర్షిస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రథమ శత్రువు అని అమిత్ షా దిశానిర్దేశం చేసి వెళ్లినందున ఆ పార్టీకి చెందిన వారినే ముందుగా టార్గెట్ చేస్తారన్న ఓ అంచనా ఉంది. అయితే ప్రస్తుతం ఏపీ బీజేపీలో ఉన్న కొంత మంది నేతలకు అది నచ్చదు. వారి టార్గెట్ వేరు. టీడీపీ నేతల్ని ఆకర్షించాలని అనుకుంటారు. కానీ ఏపీలో టీడీపీకి గడ్డు పరిస్థితులు ఉన్నప్పుడే ఆ పార్టీ నేతల్లో వెళ్లాల్సిన వాళ్లంతా వెళ్లిపోయారు. వాళ్లు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు టీడీపీ పుంజుకుంటోందన్న అభిప్రాయం బలపడుతున్న సమయంలో బయటకు వెళ్లడం కష్టమే. పైగా కేసులు ఉన్న వాళ్లు ఎప్పుడో బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు ఉన్న టీడీపీ నేతల్లో కేసులకు భయపడేవారు కూడా లేరు. ఇక వైఎస్ఆర్‌సీపీ నేతలు అధికారంలో ఉన్నారు. ఆ పార్టీ నేతల్లో అనేక మంది ఆర్థిక లావాదేవీలపై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నాయి. చిన్న చిన్న విచారణలు చేస్తేనే దొరికిపోయేంతగా వారి స్కాంలు ఉన్నాయనేది బహిరంగరహస్యం. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు నేరుగా జోక్యం చేసుకోలేవు కాబట్టి.. బీజేపీ చేరికలకు భిన్నమైన వ్యాహాన్ని అమలు చేయాల్సిందే.అమరావతి రైతుల పాదయాత్రను ఇప్పటి వరకూ హేళన చేసిన ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు నేరుగా వారి పోరాటానికి మద్దతివ్వడానికి రంగంలోకి దిగుతున్నారు. 21వ తేదీన సోము వీర్రాజు నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం రైతులను కలిసి సంఘిభావం ప్రకటించనుంది. వారితో పాటు కొంత దూరం పాదయాత్ర చేయనుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు రైతుల పాదయాత్ర చేరుకుంది. నిన్నామొన్నటి వరకూ సోము వీర్రాజుతో పాటు మరికొంత మంది నోటితో మద్దతిచ్చి… అమరావతి రైతుల్ని నొసటితో వెక్కిరించేవారు. విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారు అమరావతి మహిళా రైతుల దుస్తుల మీద వ్యాఖ్యలు చేసేవారు. రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులనేవారు. అయితే తిరుపతిలో హోంమంత్రి అమిత్ షా క్లాస్ ఇచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. వారు నేరుగా అమరావతికి మద్దతు ప్రకటిస్తున్నారు. నిజానికి పాదయాత్ర ప్రారంభం రోజున రావెల కిషోర్‌తో పాటు కొంత మంది బీజేపీ నేతలు సంఘిభావం చెప్పారు. వారిపై ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ ధియోధర్ మండిపడ్డారు. ఫోన్ చేసి మండిపడ్డారన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో బీజేపీ తీరుపై విమర్శలు ప్రారంభమయ్యాయి. అమిత్ షా సీరియస్‌గా చెప్పడంతో ఇక సోము వీర్రాజు అండ్ టీంకు కూడా తప్పడం లేదు. ఇప్పటికే అమరావతికి మద్దతుగా ఉన్న బీజేపీలోని ఓ వర్గంతో వీరు కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం చేస్తారు.. ఎలా చేస్తారు అన్నది ముందు ముందు తెలియాల్సి ఉంది. వైసీపీ నేతల్ని టార్గెట్ చేయడం ఇష్టం లేక ఏపీ బీజేపీ నేతలు ఈ విషయాన్ని కూడా లైట్ తీసుకుంటే బీజేపీ పరిస్థితి మరీ తీసి కట్టే అవుతుంది.

Related Posts