YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కుదేలవుతున్న కదలరా...

కుదేలవుతున్న కదలరా...

తిరుపతి,  నవంబర్ 20,
తిరుపతి, కడప జిల్లాల్లో వచ్చిన వరదలకు వందల మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రాణ నష్టం కూడా ఎక్కువగానే ఉంది. రాజంపేట మండలం గుండ్లురు వద్ద బస్సు చెరువులో ఆగిపోయిన సమయంలో బస్సులో ఉన్న వారిలో కనీసం పదిహేను మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇరవై గంటల పాటు వారి గురించి పట్టించుకునేవారే లేకపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది. అలాగే పుల్లూరు, మందపల్లి, పులత్తూరు గ్రామాల్లోనే కనీసం యాభై మంది చనిపోయారని ఎమ్మెల్యే అధికారికంగా చెప్పారు. ఇంకా మొత్తం చూస్తే ఎక్కువ మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి బీభత్సమైన పరిస్థితి ఉంటే హెలికాఫ్టర్‌ను ఈ రోజు మధ్యాహ్నానికి పంపించారు. ఇప్పటికి జలదిగ్బంధంలోనే అనేక మంది ఉన్నారు. వారిని బయటకు తెచ్చే కార్యక్రమాలు చాలా స్లోగా సాగుతున్నాయి. తిరుపతిలో వరదల దృశ్యాలు చూసి చిరంజీవి కూడా ఆందోళన చెందారు. ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో నదులు ఉద్ధృత రూపానికి ఇళ్లు కూడా కొట్టుకుపోతున్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే సీఎం జగన్ తాడేపల్లి నుంచే సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఓ సారి.. మధ్యాహ్నం ఓ సారి సమీక్షలు నిర్వహించి.. శిబిరాల్లోని వారికి రూ. రెండు వేలు, మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ఏం కావాలన్నా అందుబాటులో ఉంటానని మీడియాకు చెప్పారు కానీ.. క్షేత్ర స్థాయిలో పర్యటనకు మాత్రం వెళ్లలేదు. బహుశా.. వరద అంతా శాంతించిన తర్వాత సీఎం ఏరియల్ వ్యూ చేసే అవకాశం ఉంది. ఏ సీఎం అయినా విపత్తులు జరిగితే కార్యక్షేత్రానికి వెళ్లి అధికారుల్ని అప్రమత్తం చేస్తారు. కానీ సీఎం జగన్ మాత్రం ఎప్పుడూ విపత్తులను సీరియస్‌గా తీసుకోలేదు.

Related Posts