YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వరుణుడి దెబ్బకు వరి విల విల

వరుణుడి దెబ్బకు వరి విల విల

ఏలూరు, నవంబర్ 20,
వరి రైతుపై వరుణుడు విలయం సృష్టిస్తున్నాడు. భారీ వర్షం గాలి వాన వరి సాగు చేసిన రైతులు బెంబేలెత్తుతున్నారు. దీంతో చేతికి వచ్చిన పంట వర్షపునీటిలో నేలపై వాలింది. భారీ వర్షాలతో రైతులు ఆపదలో పడ్డారు గత కొద్ది రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అల్ప పీడనం ప్రభావానికి తోడు రైళ్లు తిరుపతి పవనాలు చురుగ్గా కదలడంతో జిల్లాలో గత పది రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వాయుగుండం ప్రభావం శుక్ర శనివారాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సమాచారం తో రైతులు తలపట్టుకుంటున్నారు. రేపల్లె మండలం లో భారీ వర్షాలకు వరి పేర్లు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి పైర్లు మొలకెత్తడం తో దాదాపు  24 వేల ఎకరాల్లో పంట నష్టం వచ్చినట్లు ప్రాథమిక అంచనా లో తెలుస్తుంది. మండల పరిధిలో దాదాపు అన్ని  గ్రామ పరిధిలోని సాగు చేసిన పంటలు వర్ష బీభత్సానికి దెబ్బతిన్నాయి. వారం రోజుల్లో కోతకు వచ్చిన వరి పంట గాలివాన దెబ్బకు నేల వాలింది.ఆరుగాలం శ్రమించి పండించిన అన్నదాతల ఆశలపై వరుస విపత్తులు నీళ్లు చల్లుతున్నాయి. అతికొద్ది రోజుల్లోనే పంట చేతికందే పరిస్థితుల్లో వాతావరణంలో మార్పులు తీవ్ర నష్టాలను గురి చేస్తున్నాయివరి పంట సాగు ఎకరాకు 30 వేలు పెట్టుబడి పెట్టామని రైతులు తెలిపారు. పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా వరి పంట నేల ఉందన్నారు. వారం రోజులలో వరి పంట కోత మొదలుపెట్టాలని భావించామని అంతలోనే గాలివాన బీభత్సం రైతుకు అపార నష్టం జరిగిందన్నారు. కౌలురైతు వాకా బిక్షాలు రేపల్లె మండలం పేటేరు గ్రామంరెండెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తూ ఎకరాకు 30 వేల చొప్పున అప్పుచేసి పెట్టుబడి పెట్టాను. 70 శాతానికి పైగా పంట నష్టం జరిగింది ప్రభుత్వం వెంటనే స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నారు.వర్షాలు లేకుండా ఉంటే 35 బస్తాల నుండి 40 బస్తాల వరకు దిగుబడి వచ్చేది, కానీ ఈ వర్షాల వల్ల పదిహేను బస్తాల నుంచి 20 బస్తాల దిగుబడి వస్తాయని అంచనా, కానీ పాడైపోయిన పంటను కొన్ని పరిస్థితులు కనిపించడం లేదు ఖర్చులు విపరీతంగా పెరిగాయి అప్పులు ఎలా తీర్చాలి తెలియటం లేదు

Related Posts