అనంతపురం
కదిరి పట్టణంలో రెండు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో రెండు మృతదేహాలను సిబ్బంది వెలికితీశారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఘటనలో ఒక ఇంట్లో ఉన్న 8 మంది, మరో ఇంట్లోని ఏడుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. మొత్తం 15 మందిలో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ మృతిచెందారు. 10 మంది క్షేమంగా బయటపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. భవనం కూలే సమయంలోనే గ్యాస్ సిలిండర్ పేలిందని బాధితులు తెలిపారు. ఘటనాస్థలిని అదనపు ఎస్పీ రామకృష్ణప్రసాద్, ఆర్డీవో వెంకటరెడ్డి పరిశీలించారు. శిథిలాల్లో ఉన్న కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో శిథిలాలను తొలగిస్తున్నారు.