YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రిజర్వాయర్ల పనుల్లో వేగం పెంచాలి.

రిజర్వాయర్ల పనుల్లో వేగం పెంచాలి.

పంటలు పండక భీడుగా మారుతున్నపాలకుర్తి నియోజకవర్గంలోని భూములకు సాగునీరందించాలన్న లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం హన్మకొండ చింతగట్లులోని దేవాదుల ప్రధాన కార్యాలయంలో దేవాదుల ప్రాజెక్ట్ అధికారులు, కాంట్రాక్టర్లతో రిజర్వాయర్ల పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ 15కల్లా పనులను పూర్తి చేసి, వచ్చే ఖరీఫ్ పంటలకు సాగునీరందించేందుకు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పాలకుర్తి, చెన్నూర్, నష్కల్ రిజర్వాయర్లు పూర్తైతే.. సుమారు 65వేల ఎకరాలకు సాగునీరందుతుందని, పాలకుర్తి నియోజకవర్గం పచ్చని పంటలతో సస్యశ్యామలం అవుతుందన్నారు. రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అన్నధాతలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, అందుకు అధికారులు పనుల పురోగతిలో వేగం పెంచి, ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కృషిచేయాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టి, మరో ఏజెన్సీ ద్వారా పనులు పూర్తి చేయించేందుకు అధికారులు కఠినంగా వ్యవహిరించాలన్నారు. 

Related Posts