YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరం అసెంబ్లీలో పరిణామాలపై బాలకృష్ణ స్పందన

వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరం అసెంబ్లీలో పరిణామాలపై బాలకృష్ణ స్పందన

అమరావతి
ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడారు. ఆడవాళ్ల జోలికొస్తే చేతులు ముడుచుకోవడం సరికాదు. మంచి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో లేదీ ప్రభుత్వం. మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తామని అన్నారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంపై దాడి చేయించారు. చంద్రబాబుపై ఎన్నోవిధాలుగా దాడులకు ప్రయత్నించినా ఆయన సంయమనంతో ఉన్నారు. ఇకపై ఎవరు నోరు తెరిచినా ఉపేక్షించేది లేదు. ఆడవాళ్లను తెరపైకి తెచ్చి రాజకీయాల్లో మైండ్గేమ్ ఆడుతున్నారు. రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేశారు. మీకు దాసోహం చేసేలా చేసుకోవడం మంచిది కాదు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరమని బాలకృష్ణ అన్నారు. సజావుగా సాగాల్సిన అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకు వేదికైంది. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడిపెట్టుకోవటం ఎప్పుడూ లేదు. అసెంబ్లీలో సవాళ్లు, ప్రతిసవాళ్లు ఆనవాయితే. ప్రజాసమస్యలపై పోరాడటమే అసెంబ్లీ వేదికగా ఉండేది. అభివృద్ధిపై చర్చకు బదులు వ్యక్తిగత అజెండా తీసుకొచ్చారు. వైకాపా నుంచి మహిళా శాసనసభ్యులు సభలో ఉన్నారు. నా సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరం. అసెంబ్లీలో ఉన్నామో... పశువుల కొంపలో ఉన్నామో అర్థం కాలేదని అయన అన్నారు. అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారు... హేళన చేయవద్దు. కొత్త నీచ సంస్కృతికి తెరలేపారు.. ఆ పార్టీలోనూ బాధపడే వారున్నారు. ఏకపక్షంగా సభను నడుపుతున్నారు. రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు.

Related Posts