YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వంశీ, నాని, అంబటిలకు నందమూరి ఫ్యామలీ వార్నింగ్

వంశీ, నాని, అంబటిలకు నందమూరి ఫ్యామలీ వార్నింగ్

హైదరాబాద్, నవంబర్ 20,
విర్రవీగి మాట్లాడేవారు ఇకపై నోరు అదుపులో పెట్టుకోవాలంటూ బాలకృష్ణ హెచ్చరించారు. ఫ్యామిలీని టచ్ చేసి చూశారు..ఇక ఇంకోసారి..ఇలాంటివి రిపీట్‌ అయితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు బాలయ్య. నందమూరి ఆడవారిని గురించి ఎవరైనా మాట్లాడితే..హద్దు మీరి ప్రవర్తిస్తే..నోటికొచ్చినట్లు వాగితే…ఖబర్దార్ అంటూ వేలు చూపిస్తూ…వార్నింగ్ ఇచ్చారు బాలయ్య. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడిపెట్టుకోవటం ఎప్పుడూ లేదని నందమూరి బాలకృష్ణ అన్నారు ప్రజాసమస్యలపై పోరాడాల్సిన అసెంబ్లీలో అభివృద్ధిపై బదులు వ్యక్తిగతమైన విషయాలు తీసుకువచ్చారని గరమయ్యారు. రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలు గమనిస్తున్నారని,  రాజకీయం రాజకీయనేతల మధ్య ఉండాలి..ఫ్యామిలీ మధ్య కాదు. చట్టసభల్లో ఉండి ఇలాంటి మాటలా… అసెంబ్లీలో ఉన్నారా..గొడ్ల చావిడిలో ఉన్నారా….అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు బాలయ్య. ఇన్నాళ్లూ సహించాం భరించాం..ఎప్పుడైనా ఆవేశం వస్తే చంద్రబాబు ఆలోచించి మమ్మల్ని ఆపేవారు.  ప్రజాసమస్యలపై పోరాడాల్సిన అసెంబ్లీలో అభివృద్ధిపై బదులు.. వ్యక్తిగత అజెండా తీసుకువచ్చారని ఫైరయ్యారు. రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. తన భార్యపై, కుటుంబంపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు కన్నీటి పర్యంతం అయిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై నందమూరి కుటుంబ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టారు. రాజకీయాలతో సంబంధం లేని మహిళపై.. ఈ రకమైక కామెంట్స్ హేయమన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నందమూరి రామకృష్ణ ఎమోషనల్ అయ్యారు. రెండు, మూడేళ్ల నుంచి చూస్తున్న ఘటనలు చూస్తుంటే… చాలా బాధగా ఉందన్నారు. తమ కుటుంబం జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి పరిణామం ఏ కుటుంబానికి జరగకూడదన్నారు. ద్వారంపూడి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు హద్దులు మీరారని.. వారు భవిష్యత్ గురించి ఆలోచించుకోని మాట్లాడాలన్నారు. మీ ఇళ్లలో ఆడవాళ్లు ఏమనుకుంటున్నారో చూసుకోండి అంటూ ఫైరయ్యారు నందమూరి రామకృష్ణ. రాజకీయంగా ఉంటే… రాజకీయంగానే చూసుకోవాలని.. వ్యక్తిగతంగా విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. తామేం గాజులు తొడుక్కుని కూర్చోలేదని..  ఎన్టీఆర్, టీడీపీ క్రమశిక్షణ మాత్రమే నేర్పిందని పేర్కొన్నారు. తమ సహనాన్ని పరీక్షించొద్దని నందమూరి రామకృష్ణ వార్నింగ్ ఇచ్చారు.  ఇకపై వైసీపీ హద్దు మీరితే… తామూ హద్దు మీరుతామని స్పష్టం చేశారు.

Related Posts